పాతబస్తీలో బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్, రైతుపై ఎలుగుబంటి దాడి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. పాతబస్తీకి చెందిన బీజేపీ నేత పొన్న వెంకటరమణ కుమారుడు శబరీష్ (15)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు.
శబరీష్ చైతన్య టెక్నో స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి శబరీష్‌ను ఇద్దరు వ్యక్తులు రైలు ఎక్కిస్తుండగా చూసిన మహిళ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వెంటనే ఆయన పాతబస్తీలోని శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శబరీష్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించినట్టు అమానించిన పోలీసులు ప్రస్తుతం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలు వెంకటరమణ కుటుంబాన్ని ఓదార్చేందుకు అక్కడికి చేరుకున్నారు.
రైతుపై ఎలుగుబంటి దాడి
పొలం వద్దకు వెళ్తోన్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. జిల్లాలోని చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో జరిగిన ఈ దాడిలో రైతు మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు రైతు మల్లయ్యను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications