వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ కేసీఆర్ - రంగంలోకి బీజేపీ ముఖ్య నేతలు: నియోజకవర్గాల్లో మకాం..!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ నాయకత్వం మొత్తం హైదరాబాద్ లో మకాం వేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు వ్యూహాత్మకంగానే భాగ్యనగరంలో ఖరారు చేసారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. ఒక విధంగా టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా బీజేపీ నేతలు తెలంగాణలో మోహరించారు. ఈ సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది. ఇక, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు... ప్రధాని బహిరంగ సభ ద్వారా సమరశంఖం పూరించటానికి సిద్దమయ్యారు.

టార్గెట్ టీఆర్ఎస్ - కొత్త ప్రణాళికలు

టార్గెట్ టీఆర్ఎస్ - కొత్త ప్రణాళికలు


ప్రధానితో సహా పార్టీ ముఖ్య నేతలు మూడు రోజులు ఇక్కడే ఉండనున్నారు. జూలై 3న పరేడ గ్రౌండ్స్ లో నిర్వహించే ప్రధాని బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా పేరు ఖరారు చేసారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు భారీ జనసమీకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనసమీకరణ బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ముఖ్యంగా హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇక, సమావేశాల సమయంలో తెలంగాణ జిల్లాల్లో పార్టీ నేతల పర్యటనలకు కార్యచరణ సిద్దం చేసారు. అందులో ఇప్పటికే దాదాపు 40 మంది బీజేపీ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా నియోజకవర్గాల్లో తమకు అప్పగించిన ప్రాంతాలకు వెళ్లారు.

ప్రతిష్ఠాత్మకంగా ప్రధాని సభ

ప్రతిష్ఠాత్మకంగా ప్రధాని సభ

పార్టీ పరిస్థితుల అధ్యయనం.. బీజేపీ సమావేశాలు..బహిరంగ సభకు పెద్ద ఎత్తన జనం తరలి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని నియోజవకర్గాల్లోనూ నేతలకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ కు తరలించేందుకు ప్రత్యేకంగా 16 రైళ్లు.. పెద్ద సంఖ్యలో బస్సులను ముందుగానే బుక్ చేసుకున్నారు. 10 లక్షల ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి కనీసం 25 -30 మంది వరకు తీసుకొచ్చే బాధ్యత బూత్ అధ్యక్షుడితో పాటుగా శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లకు అప్పగించారు. ఇక, ఇదే సమయంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రంగంలోకి దిగిన బీజేపీ నేతలు పార్టీ పరిస్థితి పైన ఆరా తీస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

నియోజకవర్గాలకు బీజేపీ నేతలు

నియోజకవర్గాలకు బీజేపీ నేతలు

తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశం పైన నివేదికలు సిద్దం చేసి అధినాయకత్వానికి అందించనున్నారు. వాటి ఆధారంగా వచ్చే ఎన్నికల కోసం బీజేపీ క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలు .. తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఒక అంచనాకు రానుంది. ఏ విధంగా అయినా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఏడాది ముందుగా తమ కార్యచరణ అమలు మొదలు పెట్టింది. ఇక, బహిరంగ సభలో ప్రధాని ఏం చెబుతారనే ఆసక్తి కమలం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

English summary
BJP leaders making arrangements for PM Modi publice meeting on 3rd july, Leaders rush to constituencies to know the ground realities and public opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X