వరంగల్‌లో ప్రచారానికి రండి: ఎర్రబెల్లితో మాట్లాడి చెబుతానన్న బాబు..!(ఫోటోలు)
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక కోసం బీజేపీ నేతలు శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరంగల్ ఉపఎన్నిక బరిలో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దేవయ్య కోసం ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసేందుకే సమావేశమయ్యారు.
చంద్రబాబుతో కలిసిన వారిలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, బీజేఎల్‌పీ నేత కే లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. సుమారు గంట సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా బీజేపీ నేతలు చంద్రబాబును కోరారు.
దీనికి గాను వరంగల్ జిల్లాకే చెందిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో మాట్లాడి ప్రచారంలో పాల్గొనే విషయాన్ని తెలియజేస్తానని చంద్రబాబు వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదిఇలా ఉంటే వరంగల్ ఉపఎన్నికలో దేవయ్యకు ప్రజల మద్దతు పెరిగిందని బీజేపీ నేతలు చంద్రబాబుకు వివరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ప్రజల్లో పెద్దఎత్తున అసంతృప్తి నెలకొని ఉందన్నారు. అంతేకాదు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై చెప్పు విసిరి నిరసన వ్యక్తం చేసిన సంఘటనను సైతం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై వరంగల్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎన్డీఏకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ,బీజేపీలు మరింత సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు.

వరంగల్‌లో ప్రచారానికి రండి: ఎర్రబెల్లితో మాట్లాడి చెబుతానన్న బాబు
వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక కోసం బీజేపీ నేతలు శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరంగల్ ఉపఎన్నిక బరిలో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దేవయ్య కోసం ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసేందుకే సమావేశమయ్యారు.

వరంగల్‌లో ప్రచారానికి రండి: ఎర్రబెల్లితో మాట్లాడి చెబుతానన్న బాబు
చంద్రబాబుతో కలిసిన వారిలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, బీజేఎల్‌పీ నేత కే లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. సుమారు గంట సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా బీజేపీ నేతలు చంద్రబాబును కోరారు.

వరంగల్‌లో ప్రచారానికి రండి: ఎర్రబెల్లితో మాట్లాడి చెబుతానన్న బాబు
దీనికి గాను వరంగల్ జిల్లాకే చెందిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో మాట్లాడి ప్రచారంలో పాల్గొనే విషయాన్ని తెలియజేస్తానని చంద్రబాబు వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదిఇలా ఉంటే వరంగల్ ఉపఎన్నికలో దేవయ్యకు ప్రజల మద్దతు పెరిగిందని బీజేపీ నేతలు చంద్రబాబుకు వివరించారు.

వరంగల్‌లో ప్రచారానికి రండి: ఎర్రబెల్లితో మాట్లాడి చెబుతానన్న బాబు
టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ప్రజల్లో పెద్దఎత్తున అసంతృప్తి నెలకొని ఉందన్నారు. అంతేకాదు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై చెప్పు విసిరి నిరసన వ్యక్తం చేసిన సంఘటనను సైతం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై వరంగల్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎన్డీఏకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ,బీజేపీలు మరింత సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు.

Click it and Unblock the Notifications