జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్ధిగా - అనూహ్య ఎంపిక, మారిన లెక్కలు..!!

జూబ్లీహిల్స్ అభ్యర్ధి విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పటికే సునీతను తమ అభ్యర్ధి గా ప్రకటించగా.. కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీజేపీ అభ్యర్ధి విషయంలో కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవటంతో.. బీజేపీ ఎవరిని బరిలోకి దించుతుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్ జారీతో ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ సైతం ఇక్కడ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేసింది. సామాజిక సమీకరణాలు.. పార్టీల బలాబలాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్ధి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ నుంచి ముగ్గురు పేర్లు కేంద్ర కమిటికీ అందాయి.

BJP likely to field Deepak reddy for Jubilee hill by poll as reports

కాగా, ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో పోటీ కోసం దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు. ఈ పేర్ల పైన పార్టీ నాయకత్వం చర్చించింది.

అయితే, తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్దిగా దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసినా.. చివరి నిమిషంలో ప్రకటించ కుండా.. మరింత చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ నుంచి ఎవరిని పోటీ పెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీచేసిన మాధవీలత అభ్యర్థిత్వం పైనా పరిశీలన చేసారు.

అయితే.. రాష్ట్ర నాయకత్వం నుంచి దీపక్ రెడ్డి సరైన అభ్యర్దిగా సూచన రావటంతో.. ఈ ఇద్దరిలో ఒకరి పేరును ఈ రోజు బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించారు. ఇక.. బీజేపీ సైతం ఇక్కడ పోటీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. ఇక.. ప్రచార పర్వం లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+