రాజాసింగ్ కు బీజేపీ బిగ్ టాస్క్ - సమర్ధతకు పరీక్ష..!!

తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాలు ప్రభావం చూపించే ఎన్నికలు కావటంతో...అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

మారుతున్న లెక్కలు: బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది. గతం కంటే బలం పెరిగిందని అంచనా వేస్తోంది. దీంతో, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ లో మెజార్టీ సీట్లు సాధించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ముందుగానే అభ్యర్దులను ఖరారు చేసేందుకు ప్రాధమిక కసరత్తు ప్రారంభించింది.

BJP likely to Field MLA Rajasingh for Hyderabad loksabha in next Elections

ప్రస్తుతం నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అందులో అదిలాబాద్ మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు తిరిగి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురం అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగనున్నారు.

ఎంపీగా బరిలోకి రాజాసింగ్: బీజేపీ నేత ఈటల రాజేందర్ సైతం ఈ సారి అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నగరం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ను లోక్ సభ బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ సీటు ఎంఐఎం గెలుస్తూ ఉండటంతో చెక్ పెట్టాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

అందులో భాగంగా రాజాసింగ్ వైపు చూస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ లేదా జహీరాబాద్ నుంచి రాజాసింగ్ ను పోటీకి దించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తే..హైదరాబాద్ నుంచి రాజాసింగ్ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశం పైన ఇప్పటికే రాజాసింగ్ తన అభిప్రాయం స్పష్టం చేసారు.

BJP likely to Field MLA Rajasingh for Hyderabad loksabha in next Elections

పోటీకి సిద్దమంటూ: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తాన‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు. గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వెళ్లారన్నారు. నిధులు ఇటలీ నుండి తెస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి తెస్తారా చెప్పాలన్నారు.

అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని, మంచి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8మంది ఎమ్మెల్యేలము కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ లు ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో..ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+