Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాకు పట్టిన గతే త్వరలో హరీశ్‌కు.. పీకే ఆలోచనలు తెలంగాణలో చెల్లవు : కేసీఆర్‌పై ఈటల ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను దగా చేయడంతో సిద్దహస్తులని మండిపడ్డారు. ఆయన మాటలకు , చేతలకు పొంతన లేదని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడే ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. వచ్చే అసెంబ్లీలో ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తీర్పులాగే.. రాష్ట్ర వ్యాప్తంగా రానుందని జోస్యం చెప్పారు.

చేతకాని దద్దమ్మ పాలన

చేతకాని దద్దమ్మ పాలన


రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. చేతకాని దద్దమ్మ కేసీఆర్ పాలనలో రైతులు ఆగమవుతున్నారని విమర్శించారు. విద్యుత్ కోతలతో చేతికి వస్తున్న పంట ఎండిపోతోందన్నారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇచ్చే దమ్మ ధైర్యం సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. దళితబంధులను దగా చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు కింద రూ. 10 లక్షలు ఎక్కడా ఇవ్వడంలేదన్నారు. మొగ్గుబడిగా కొందరికి ఇచ్చి మిగతా వారి కండ్లలో కారం కొట్టారని దుయ్యబట్టారు.

బీసీల‌ను అణ‌గ‌దొక్కేందుకు కుట్ర‌..

బీసీల‌ను అణ‌గ‌దొక్కేందుకు కుట్ర‌..


కేసీఆర్ మోసపూరిత మాటలకు ఇక కాలం చెల్లిందంటూ ఈటల మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీ చైతన్య సదస్సులో ఈటెల పాల్గొన్నారు. బీసీల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 5,500 కోట్లలో .. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలను అణగదొక్కుతున్నారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదని దుయ్యబట్టారు.

3కేసీఆర్‌, పీకేల ఎత్తులు చెల్ల‌వు..

3కేసీఆర్‌, పీకేల ఎత్తులు చెల్ల‌వు..


తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ ఆలోచనలు తెలంగాణలో పనిచేయవన్నారు. కేసీఆర్, పీకేలు ఎన్నికుట్రలు, మోసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు కేసీఆర్ చేస్తున్న మోసం తెలుసన్నారు. బుద్ధి చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Recommended Video

    Etela Rajender Exclusive : ప్రజలు TRS ని Telangana నుంచే గెంటేస్తారు | Oneindia Telugu
     నాడు నా ప‌రిస్థితి .. త్వ‌ర‌లో హ‌రీశ్‌కు..

    నాడు నా ప‌రిస్థితి .. త్వ‌ర‌లో హ‌రీశ్‌కు..


    టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చెక్ పెడితేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు ఈటల. ఆపార్టీ ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రులు అవుతారని విమర్శిచారు. బీజేపీలో సామాన్యుడు కూడా సీఎం అవుతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తన ఎదుగుదలను చూసి కేసీఆర్ ఓర్వలేక తుంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నాడు త‌నుకు పార్టీలో ఎదురైన పరాభవమే.. రేపు మంత్రి హరీశ్ రావుకు కూడా పడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+