నిరసన తెలిపితే గొడ్లను కొట్టినట్లు కొడతారా?.. కేసీఆర్‌ను పాతాళంలోకి పాతరేయాలి.. ఈటల ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ నేతల వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317జీవో తెచ్చి అన్యాయంగా ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దుయ్యబట్టారు. ఉద్యోగులతో పెట్టకున్న వారెవ్వరూ బాగుపడింది లేదన్నారు. ప్రజలను అణిచివేయాలని చూస్తే పాతాళానికి తొక్కిపడేస్తారని హెచ్చరించారు.

పాతాళానికి పాతరేస్తారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేష్టలతో ఉద్యోగులు ఆగమవుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. 317 జీవోతో అన్యాయానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో 317 జీవోకు నిరసనగా ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సమస్యలపై నిరసనకు దిగారు.వారికి సంఘీభావం తెలిపిన ఈటల కేసీఆర్‌పై తీర్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగులతో పెట్టకున్నవారెవ్వరూ బాగుపడలేదన్నారు. వారే నిన్ను పాతాళానికి పాతరేస్తారని హెచ్చరించారు.

కేసీఆర్‌ని గద్దె దించేందుకు సిద్ధం..
ముఖ్యమంత్రి ఏ పంట వేయంటే ఆ పంటను పాలమూరు రైతు బిడ్డలు వేశారు.. ఇప్పుడు వరి వద్దంటే ఎలా..? అని ఈటల మండిపడ్డారు. అన్నీ నీళ్లున్న భూముల్లో ఏ పంట పండుతుందని నిలదీశారు. మంత్రులు కుంభకర్ణుడిలా నిద్ర పోతూ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల ఉత్సవాలు జరుపుకుంటున్న మంత్రుల సభలకు జనం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వెంట ఏ కులం, ఏ వర్గం లేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంతో ప్రజలు సిద్ధమైయ్యారని ఈటల నిప్పులు చెరిగారు .

టీఆర్ఎస్ నేతల ఆగడాలు
టీఆర్ఎస్ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఈటల మండిపడ్డారు. తమకు అండాగా నిలచిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆటలు ఎక్కువరోజులు సాగవు. హుజూరాబాద్ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పారో .. యావత్తు తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌ను బొంద పెడతారన్నారు. కేసీఆర్ వికృత చేష్టలు , అణిచివేతలు ఇలాగే కొనసాగితే కబర్ధార్ అంటూ హెచ్చరించారు.
Recommended Video

ఉద్యోగులే పాతాళంలోకి పాతరేస్తారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు అనాడు ఉద్యమంలో పాల్గొన్నవారు టీచర్లు, ఉద్యోగులు కాదా అని కేసీఆర్‌ని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగులు వారి సమస్యలను తెలిపేందుకు బీజేపీ నేతల దగ్గరకు వస్తే వారిపై కక్షకడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్పర్లు, సస్పెండ్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులతో పెట్టకుంటే వారే మీకు కర్రు కాల్చి వాతపెడతారన్నారు. కేసీఆర్‌ని పాతాళంలోకి పాతరేస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపితే.. వారిని గొడ్లను కొట్టినట్లు కొడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే వీటన్నింటికి కేసీఆర్ మూల్యం చెల్లించుకుంటారని ఈటల హెచ్చరించారు..












Click it and Unblock the Notifications