భారత్ -పాక్ మ్యాచ్ లో రాజాసింగ్ పోస్టర్ తో : కోహ్లీ బ్యాటింగ్ వేళ..!!
భారత క్రికెట్ అభిమానులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. కోహ్లీ దీపావళి ధమాకాతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటో అభిమానులు ప్రదర్శించటం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం భారత్ - పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకు సాగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఇదే మ్యాచ్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి రెండు ఓవర్లు ఆడిన తీరు ఏ క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోలేరు.
పాకిస్థాన్ తో మ్యాచ్..అందునా ప్రపంచ కప్. దీపావళి పర్వదినం. క్రికెట్ కిక్కు ఎలా ఉంటుందో మరోసారి కోట్లాది మంది ఆస్వాదించారు. ఇది కదా క్రికెట్ అంటే అనే రీతిలో చివరి నిమిషం వరకు అభిమానులను మ్యాచ్ వద్దే కట్టిపడేసారు. మెల్ బోర్న్ స్టేడియం లో 90 వేల మందికి పైగా ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించారు. అందులో హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. వారు అంతర్జాతీయ మ్యాచ్..అందునా పాకిస్థాన్ తో మ్యాచ్ కావటంతో తమ అభిమాన ఎమ్మెల్యే ఫొటో ప్రదర్శించి తమ వైపు ఫోకస్ పడేలా చూసారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కొనసాగుతున్న వేళ ప్రదర్శించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వర్గానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసారనే కారణంగా రాజా సింగ్ పైన కేసు నమోదైంది. బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీని పైన రాజాసింగ్ తన సతీమణి ద్వారా పార్టీ నాయకత్వానికి సంజాయిషీ పంపారు. ఇటు రాజాసింగ్ పైన పీడ యాక్టు నమోదైంది. రాజాసింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ సమయంలో మెల్ బోర్న్ వేదికగా ప్రపంచం మొత్తం భారత్ -పాక్ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో రాజాసింగ్ ఫొటో ప్రదర్శన వైరల్ గా మారింది. రాజాసింగ్ అభిమానులుగా వీరిని భావిస్తున్నారు. ఎటువంటి నినాదాలు లేకుండా కేవలం రాజాసింగ్ కాషాయ దుస్తుల్లో ఉన్న ఫొటో తో పాటుగా ఛత్రపతి శివాజీ ఉన్న పోస్టర్ ను మాత్రం చేత పట్టి లక్ష మంది క్రికెట్ అభిమానుల మధ్య ప్రదర్శించటం..వైరల్ కావటం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.
Goshamahal MLA Posters waved during the match in Australia thats the popularity of our leader T Raja Singh Ji😎❤️✊🏻🇮🇳🚩#T20WC2022 @ICC @imVkohli #Australia #wesupportrajasingh #TigerRajaSingh @TigerRajaSingh #isupportrajasinghgoshamahal @BCCI @SaiArjunSharma @iRupND @jag_ind pic.twitter.com/uyqBSopUzY
— Abhi Sharma Jagannath Puri (@AbhiSbunny) October 23, 2022












Click it and Unblock the Notifications