సీఎం రేవంత్ రెడ్డిని తెగ పొగిడేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు తెలపడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికి కారణమైంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గణేష్ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో స్వయంగా పర్యవేక్షించడం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి రాజా సింగ్ మద్దతు
ఇంతకు ముందు హైడ్రా కూల్చివేతలపైన కూడా రేవంత్ కు తన మద్దతు అందించిన రాజా సింగ్ ఓవైసీ కళాశాలలు, నివాసాలు ఆక్రమణలని, వాటిని కూడా కూల్చాలని రేవంత్ రెడ్డికి శూచించారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు రాజా సింగ్.

BJP MLA Raja Singh praised CM Revanth Reddy over ganesh immersion arrangements

రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
హైదరాబాద్ లో అత్యంత ఘనంగా సాగుతున్న వినాయక నిమజ్జనాలను సీఎం రేవంత్ రెడ్డి తానే వచ్చి స్వయంగా పర్యవేక్షించడం హర్షించదగిన విషయమని రేవంత్ రెడ్డికి రాజాసింగ్ కితాబిచ్చారు. బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభా యాత్రలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి ఆ పని చెయ్యటం సంతోషం కలిగించింది
ఈసారి గణేష్ నిమజ్జనోత్సవానికి ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు బాగా పనిచేశాయని ప్రశంసించిన రాజసింగ్ ముఖ్యంగా ఈసారి పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది అన్నారు. గణేష్ శోభాయాత్రను, నిమజ్జనోత్సవాన్ని స్పెషల్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించి స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించడం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడం చాలా సంతోషాన్ని కలిగించిందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

ఏ సీఎం ఇలా చెయ్యలేదన్న రాజా సింగ్
ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి దర్శించుకుని తొలి పూజ కూడా చేసినట్టుగా పేర్కొన్న రాజాసింగ్ ఎప్పటికప్పుడు గణేష్ నిమజ్జన ఉత్సవానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారని ఇది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమని కొనియాడారు. గతంలో ఎప్పుడు గణేష్ నిమజ్జన సమయంలో ఏ సీఎం ఈ తరహా పనితీరును కనబరచలేదని, రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+