బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్..!!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. అసెంబ్లీకి బుల్లెట్ పై వచ్చారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. అసెంబ్లీకి బుల్లెట్ పై వచ్చారు. కొంత కాలంగా తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమస్య పైన అనేక సార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు. తన వాహనం మార్చాలని అభ్యర్దించారు. రాజాసింగ్ కు కేటాయించిన వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‎ను కోరడానికి శుక్రవారం రాజాసింగ్ ప్రగతి భవన్‎కు వెళ్లారు. ఆందోళనకు దిగారు. అక్కడే కారు వదిలేసి వెళ్లడంతో పోలీసులు దానిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇదే క్రమంలో రాజాసింగ్‎ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులో వెళ్తున్న సమయంలో కారు టైర్‌ ఊడిపోయింది. గతంలో పలుమార్లు కూడా వాహనం ఇబ్బంది పెట్టింది. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదని.. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు రాజాసింగ్ తెలిపారు. అసెంబ్లీకి తన బుల్లెట్ బండిపై దర్జాగా వచ్చేశారు. పోలీసులు అసెంబ్లీ లోపలికి వదలడంతో గేట్ నంబర్ 2 నుంచి లోపలికి వెళ్లారు. రాజాసింగ్ కు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. అనేక సార్లు ఆ వాహనం రిపేరుకు రావటం.. రాజాసింగ్ ఈ విషయం పైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటం జరుగుతూ వస్తోంది.

BJP MLA Rajasingh came to Assembly on his Bullet vehicle to know protet against the govt

ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే తన నిరసన తెలియచేసేందుకు తన బుల్లెట్ బండి పైన శాసనసభకు హాజరయ్యారు. పోలీసులు తొలుత ఆయన్ను అసెంబ్లీ వద్ద ఆపారు. తరువాత వివరాలు సేకరించి లోపలకు అనుమతించారు. రాజాసింగ్ బుల్లెట్ నడుపుతుంటే వెనుక గన్ మెన్ కూర్చొని ఉన్నారు. ఎమ్మెల్యే బుల్లెట్ బండి పైన అసెంబ్లీకి హాజరు కావటంతో ఒక్కసారిగా చర్చ అటు వైపు మళ్లింది. ఇప్పుడు రాజాసింగ్ బుల్లెట్ వాహనం పైన అసెంబ్లీకి వచ్చిన విజువల్స్.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+