Nayanthara: నయనతార అన్నపూరణిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!!
2024 సంవత్సరం నయనతార కు కలిసి వచ్చినట్టుగా లేదు. కొత్త ఏడాది నయనతార నటించిన అన్నపూరణి సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కేసులు నమోదు కాగా, ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సైతం తన ఓటీటీ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది.
తాజాగా ఈ సినిమాపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అన్నపూరణి సినిమాను తీసిన జి స్టూడియోస్ పై నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని, భవిష్యత్తులో ఇటువంటి సినిమాలు రాకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.

ఈ సినిమా తీసిన దర్శకుడితో పాటు, నటీనటులపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు జీ స్టూడియోస్ ఈ సినిమా విషయంలో క్షమాపణలు చెప్పిందని విన్నా కానీ క్షమాపణలు చెప్పినప్పటికీ ఇలాంటివి రిపీట్ అవుతాయని గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి సినిమాలు చేయడం మనం అనేకసార్లు చూశామన్నారు. చర్యలు తీసుకోవాలని ఒక వీడియోను రిలీజ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
ఇదిలా ఉంటే కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూరణి సినిమా ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటుంది. మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్స్ రమేష్ సోలంకి ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మధ్యప్రదేశ్ లోనూ కేసు నమోదు అయింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ను తన ఓటీటీ ప్లాట్ ఫాం నుండి పూర్తిగా తొలగించింది.
ఈ సినిమా లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ ని తీసివేస్తామని జి స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని ఈ విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నామని జీ స్టూడియోస్ ఒక ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications