కేసీఆర్‌కు డీజీపీ చెంచాగిరి.. బీజేపీ అంటే టీఆర్ఎస్‌కి భ‌యం .. ఎంపీ అరవింద్ వార్నింగ్‌

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై ఆపార్టీ నేతలు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పెద్ద తాగుబోతు ముఖ్యమంత్రి అంటూ నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ కు అమ్ముడుపోయి ఆయనకు చెంచాగారి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు..

బండి సంజ‌య్ అరెస్ట్.. నిర‌స‌నలు..

బండి సంజ‌య్ అరెస్ట్.. నిర‌స‌నలు..

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నిరసనగా ఆపార్టీ నేతలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. దాంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘనందనరావు, బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలతో సహా ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.

కేసీఆర్‌కు డీజీపీ చెంచాగిరి..

కేసీఆర్‌కు డీజీపీ చెంచాగిరి..

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు అమ్ముడపోయి .. ఆయనకు చెంచాగిరి చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పెద్ద‌ తాగుబోతు ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆయన బాటలోనే ప‌య‌నిస్తూ తాగుబోతులుగా తయారయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది మండిపడ్డారు. ఇద్దరు, ముగ్గురు అధికారులు తప్ప.. మిగతా పోలీసులంతా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు.

బిజెపి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

బిజెపి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

ఇన్నాళ్లు ఫామ్ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ హడావిడిగా జీవో 317 తీసుకొచ్చారని అర్వింద్ విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలకు తొత్తుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు బిజెపి అంటే భయం పట్టుకుందన్నారు. కనీసం భార్య, పిల్లల దగ్గరకు కూడా పోనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పతన మొదలైందని మండిపడ్డారు.

అర‌వింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..

అర‌వింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..

మరోవైపు ఎపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్‌ సందీప్‌ ఫిర్యాదు చేశారు. దాంతో అర్వింద్ పై ఐపీసీ 504,55 (2) 506, సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 8న మీడియా సమావేశంలో సీఎంపై అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్యాణ్ సందీప్ ఫిర్యాదు మేరకు అర్వింద్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

 బండి సంజ‌య్‌కి బెయిల్ నిరాక‌ర‌ణ‌

బండి సంజ‌య్‌కి బెయిల్ నిరాక‌ర‌ణ‌

బండి సంజ‌య్ బెయిల్ పిటిష‌న్‌ను క‌రీంన‌గ‌ర్ కోర్టు తీర‌స్క‌రించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తి బండి సంజ‌య్‌కి 14 రోజుల పాటు జ్యూడీషియ‌ల్ రిమాండ్ విధించారు. క‌రీంన‌గ‌ర్ జైలుకు త‌ర‌లించారు. ప్రభుత్వ ఉద్యోగ బదిలీల కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాల‌న్న‌ డిమాండ్‌తో జిల్లాలోని త‌న‌ క్యాంప్ కార్యాలయంలో జాగ‌ర‌ణ దీక్ష‌ను బండి సంజయ్ చేపట్టారు. ఈ దీక్ష‌ను భ‌గ్నం చేసి అరెస్ట్ చేశారు. క‌రోనా నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+