వివాదాలపై పార్టీ నేతలకు నడ్డా హెచ్చరిక -కేసీఆర్ ట్రాప్ లో ఉన్నారు ..!!
తెలంగాణలో బీజేపీ నేతల వివాదాలపైన పార్టీ చీఫ్ నడ్డా సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్..బీజేపీ మధ్య స్నేహం పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ తో బీజేపీకి ఎలాంటి స్నేహం లేదని తేల్చి చెప్పారు. ముక్యమంత్రి కేసీఆర్ ట్రాప్ పడవద్దని నిర్దేశించారు. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. నేతలు ఎవరైనా ఇక పార్టీ అంతర్గత వ్యవహారాల పైన నేతల నుంచి నడ్డా ఆరా తీసారు. ఇక నుంచి విభేదాలను సహించేది లేదని స్పష్టం చేసారు.
పార్టీ నేతలకు నడ్డా క్లారిటీ: తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం తరువాత ఈ భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మూడో సారి కేంద్రంలో అధికారంలోకి రావటంలో దక్షిణాది కీలకమని స్పష్టం చేసారు. దక్షిణాది రాష్ట్రాల్లో 170 సీట్లు లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు నిర్దేశించారు.

రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితుల పైన ఆరా తీసారు. కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తరువాత తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికలకు పార్టీ సంసిద్దతపైన ఆరా తీసారు. పార్టీ అంతర్గత అంశాలు, నేతల అసంతృప్తి, రాష్ట్ర కమిటీ మార్పులు, చేర్పులపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైన ఈ భేటీలో చర్చించారు.
బీఆర్ఎస్ తో సంబంధాలు లేవు: బీజేపీ, బీఆర్‌ఎస్ మైత్రిపై కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు ఈ సమావేశంలో నడ్డాను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదనే విషయాన్ని ప్రధాని మోదీ, తాను ఇప్పటికే స్పష్టం చేసినట్టు గుర్తుచేశారు. మనతో సఖ్యత ఉన్నట్లు ప్రజలకు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని..ముఖ్యమంత్రి.. గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కుట్ర పన్నారని నడ్డా చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ ఢిల్లీకి రాని రాష్ట్ర మంత్రులు ఇప్పుడే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు అపాయింట్‌మెంట్ ఇస్తే మనతో కలిసిపోయినట్లు ప్రచారం చేస్తారు. ఇవ్వకపోతే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని బద్‌నాం చేస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ పన్నిన ఇలాంటి ఎత్తుగడలను తిప్పికొట్టాలని నడ్డా పిలుపునిచ్చారు.

ఉపేక్షిస్తే చర్యలు తప్పవు: తెలంగాణలో ఎన్నికల మూడ్ లోకి వచ్చాయని..నేతలంతా విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. కలిసి పని చేయాలని నిర్దేశించారు. పని విభజన చేసుకోవాలని..దానికి అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నడ్డా మార్గనిర్దేశనం చేసారు. ఈ రోజు జరిగే ఆఫీసు బేరర్స సమావేశం నుంచే కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నడ్డా స్పష్టం చేసారు.
పార్టీకి వ్యతిరేకంగా బహిరంగవ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు నేతల అనవసర విషయాలు బయట మాట్లాడి పార్టీకి నష్టం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ముందు అలా చేయవద్దని...మరోసారి జరిగితే ఉపేక్షించేది లేదని నడ్డా పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కలిసారు.












Click it and Unblock the Notifications