• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్‌ అక్రమాలను బీజేపి గమనిస్తోంది..! దేనికైనా సమయం రావాలన్న లక్ష్మణ్‌..!!

|

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పై రాష్ట్ర బీజేపి మరోసారి మండిపడింది. దేశంతో పాటు ఉమ్మడి రాష్ట్రాల్లో కుటుంబ పాలన చేస్తున్న పార్టీలకు కాలం చెల్లిందని, రానున్న రోజుల్లో బీజేపీనే బలమైన శక్తిగా నిలబడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. 2023లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాలపై కేంద్రం నిఘా పెట్టిందని, త్వరలో సీఎం చంద్రశేఖర్ రావు ను ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టే సమయం వస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు జేబు పార్టీగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని, ఆ రెండు పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో వ్యవహరిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మహబూబ్‌ నగర్‌లో ఆరోపించారు.

 అదికార పార్టీ స్వరం పెంచిన బీజేపి..! కేసీఆర్ విధానాలను ఎండగడుతున్న నేతలు..!!

అదికార పార్టీ స్వరం పెంచిన బీజేపి..! కేసీఆర్ విధానాలను ఎండగడుతున్న నేతలు..!!

ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ విస్మరించిందని, దళితులకు మూడెకరాల భూపంపిణీ హామీకే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి వికారాబాద్‌ జిల్లా తాండూరులో అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మాజీ మంత్రి డీకే అరుణ సూర్యాపేటలో ఆరోపించారు. కేసీఆర్‌ పాలన రజాకార్లను గుర్తుకు తెస్తోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆరోపించారు.

బీజేపి పై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్..! కమలం ఆటలు సాగవంటున్న గులాబీ నేతలు..!!

బీజేపి పై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్..! కమలం ఆటలు సాగవంటున్న గులాబీ నేతలు..!!

బీజేపీ హింసను ప్రేరేపిస్తే, శాంతిని కోరుకునే తెలంగాణ ప్రజలు ఊర్కోరని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే బెంగాల్‌లాగా తెలంగాణను చేస్తామనడాన్ని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణకు నెలకోసారి వస్తానని వీధి పోరాటాలు చేస్తానని అమిత్‌ షా అంటున్నారని, వీధి పోరాటాలు కాకుండా తాము సైద్ధాంతిక పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రానికి 15 రోజులకొక కేంద్ర మంత్రిని పంపిస్తామంటున్నారని, అభివృద్ధి కోసం కాకుండా ఇక్కడ గొడవలు పెట్టించడమే అమిత్‌ షా అజెండా అని ఆరోపించారు. కేంద్ర మంత్రులు వస్తే తాము స్వాగతిస్తామని, కానీ, ఆ మంత్రులు వారి శాఖలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేయాలని కోరారు.

బీజేపి టీఆర్ఎస్ మైండ్ గేమ్..! ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కాంగ్రెస్..!!

బీజేపి టీఆర్ఎస్ మైండ్ గేమ్..! ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కాంగ్రెస్..!!

టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల విమర్శలు ముసుగులో గుద్దులాటలా ఉందని, నిన్నటి వరకు ఒకరినొకరు 'ఆహా, ఓహో' అంటూ పొగుడుకొని, ఇప్పుడేమో బాధ పడినట్లు నటిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునే అంశాలే లేవని, రాష్ట్రానికి కేటాయింపులు లేకున్నా టీఆర్‌ఎస్‌ మాట్లాడటం లేదన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపి టీఆర్ఎస్ విధానాలను ఆయన ఎండగట్టారు.

 బీజేపి, టీఆర్ఎస్ మోసపూరిత పార్టీలు..! ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న టీపిసిసి..!!

బీజేపి, టీఆర్ఎస్ మోసపూరిత పార్టీలు..! ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న టీపిసిసి..!!

మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ తో 'మీ ప్రేమ ఉంటే చాలు.. మాకు నిధులే అవసరం లేదు' అన్న చంద్రశేఖర్ రావు ఇప్పుడేమో రాష్ట్రానికి ఏమీ జరగలేదని బాధపడుతున్నట్లు నటిస్తున్నారని ఎద్దే వా చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల గురించి బడ్జెట్‌కు ముందే కేంద్రంతో సీఎం చంద్రశేఖర్ రావు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాట్లాడాల్సిందని, వారి చేతకానితనం వల్లే రాష్ట్రానికి మొండి చేయి మిగిలిందన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో పోలీసు బలగాలతో ఓట్లు సాధించేందుకు చంద్రశేఖర్ రావు యత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM Chandrasekhar Rao's state BJP once again ignited. The party's state president,Laxman, said that the family ruling parties in the country and the joint states are long overdue and BJP will be a strong force in the coming days. They hope that their party will come to power in the telangana state in 2023.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more