• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజాసింగ్ సహా 38మందికి లిస్ట్ ఇదే, పార్టీలో చేరిన రోజే వారికి టిక్కెట్, యెండలకు నో టిక్కెట్

|

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 38 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. జాబితాలో ముగ్గురు ఎస్సీలు, ఆరుగురు ఎస్టీలు ఉన్నారు. ముగ్గురు డాక్టర్లకు చోటు కల్పించారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఐదుగురికి టిక్కెట్ దక్కింది. తెలంగాణతో పాటు చత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం విడుదల చేశారు.

తెలంగాణ 119 స్థానాలకు 38, ఛత్తీస్‌గఢ్‌లోని 90 స్థానాలకు గాను 77, మిజోరాంలోని 40 స్థానాలకు 13 మంది అభ్యర్థులను తొలి విడతగా ప్రకటించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ జంగిలి వెంకట్‌, ఆయన సతీమణి జంగిలి సునీత శనివారం మధ్యాహ్నం అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. సునీత ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలు. 2009లో సునీత చిరంజీవి స్థాపించిన పీఆర్పీ తరఫున కోరుట్ల నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.

 పార్టీ చేరిన రోజే టిక్కెట్

పార్టీ చేరిన రోజే టిక్కెట్

ఆ తర్వాత జంగిలి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన సాయంత్రానికే వారికి టిక్కెట్ ఖరారైంది. బీజేపీ తొలి జాబితాలో తాజా మాజీలైన అయిదుగురు ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకు చోటు దక్కింది. బాబూమోహన్‌కు టికెట్‌ ఇచ్చారు. జాబితాలో 1999లో పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, 1999లో తుంగతుర్తి నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంకినేని వెంకటేశ్వరరావు, భద్రాచలం నుంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన కుంజా సత్యవతిలకు టికెట్లు ఇచ్చారు.

ఏపీకి రాహుల్ గాంధీ హామీ తెలంగాణకు నష్టం: హరీష్ రివర్స్ అటాక్, బాబు వచ్చినా గెలుస్తా.. తలసాని

యెండల లక్ష్మీనారాయణకు దక్కని టిక్కెట్

యెండల లక్ష్మీనారాయణకు దక్కని టిక్కెట్

భూపాలపల్లి నుంచి టికెట్టు దక్కించుకున్న చందుపట్ల కీర్తిరెడ్డి మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు. మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి కొడుకు కేశ్‌పల్లి ఆనంద రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ టికెట్టు దక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర కొడుకు డాక్టర్ చందా సంతోష్ పినపాక నుంచి బీజేపీ తరఫున టిక్కెట్ దక్కించుకున్నారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆయనకు చోటు దక్కలేదు. ఎంపీగా పోటీ చేసే వారంతా ఎమ్మెల్యేలుగా గెలిచి తీరాలని ఇటీవల అమిత్ షా రాష్ట్ర నేతలను ఆదేశించారట. నిజామాబాద్ అర్బన్ పైన ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే?

ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే?

ముషీరాబాద్‌ - డా.కె.లక్ష్మణ్, అంబర్‌పేట- కిషన్ రెడ్డి, ఉప్పల్‌- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌, ఖైరతాబాద్‌- చింతల రామచంద్రా రెడ్డి, గోషామహల్‌- రాజాసింగ్‌, సికింద్రాబాద్ - సతీష్, మేడ్చల్ - మోహన్ రెడ్డి, ఎల్బీ నగర్ - పేరాల చంద్రశేఖర రావు, సనత్ నగర్ - ప్రదీప్ కుమార్, మలక్‌పేట ప్రకాశ్ రెడ్డి, మల్కాజిగిరి - రామచంద్ర రావు, పెద్దపల్లి- గుజ్జుల రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు, కల్వకుర్తి- తల్లోజు ఆచారి, మునుగోడు- డాక్టర్‌ జి.మనోహర్‌ రెడ్డి, పాలేరు- కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కరీంనగర్‌-బండి సంజయ్‌, దుబ్బాక- రఘునందన రావు, అందోల్‌- బాబూమోహన్‌, భద్రాచలం-కుంజా సత్యవతి, ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌, ముథోల్‌-డాక్టర్‌ పి.రమాదేవి, నారాయణపేట- కె.రతంగ్‌ పాండు రెడ్డి, మక్తల్‌- బి.కొండయ్య, షాద్‌నగర్‌- ఎన్‌.శ్రీవర్ధన్ రెడ్డి, పరకాల- డాక్టర్‌ పి విజయ చంద్రారెడ్డి, భూపాలపల్లి- డా. చందుపట్ల కీర్తిరెడ్డి,

బోథ్‌-మడావి రాజు, బెల్లంపల్లి- కొయ్యల ఎమాజీ, కామారెడ్డి- కె వెంకటరమణా రెడ్డి, నిజామాబాద్‌-కేశ్‌పల్లి ఆనంద్ రెడ్డి, పినపాక- డా.చందాసంతోష్‌కుమార్‌, ఆర్మూర్‌-పి. వినయ్‌కుమార్ రెడ్డి, ధర్మపురి- కన్నం అంజయ్య, మానకొండూర్‌(ఎస్సీ)-గడ్డం నాగరాజు, తాండూర్‌- పటేల్‌ రవిశంకర్‌, కార్వాన్‌- టి.అమర్‌సింగ్‌, గద్వాల- వెంకటాద్రిరెడ్డి, అచ్చంపేట(ఎస్సీ)- మల్లేశ్వర్‌ మేదిపూర్‌, సత్తుపల్లి-నంబూరి రామలింగేశ్వరరావు, కోరుట్ల- డాక్టర్‌ జంగిలి వెంకట్‌.

కేసీఆర్ ప్రభుత్వంపై రామ్ మాధవ్ ఆగ్రహం

కేసీఆర్ ప్రభుత్వంపై రామ్ మాధవ్ ఆగ్రహం

ఆదివారం బీజేపీ నేత రామ్ మాధవ్ మాట్లాడుతూ.. అవినీతిలో తెలంగాణ రెండోస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ విజన్‌లెస్ (ముందుచూపు) లేని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణకు రూ.1 లక్షా 15 వేల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదన్నారు. గుంతల మధ్య రోడ్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఎద్దేవా చేశారు.

English summary
All sitting MLAs including Telangana BJP President Dr K Laxman from Musheerabad constituency, got a ticket. G Kishan Reddy was renominated from Amberpet while NVSS Prabhakar is the party’s candidate again from Uppal. Chintala Ramachandra Reddy managed to secure his nomination for Khairatabad again as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X