విహారయాత్రకు వచ్చి వెళ్ళినట్టుగా.. హెలికాఫ్టర్లో మంత్రుల పర్యటన; మండిపడిన బీజేపీ
వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ మంత్రుల బృందం రైతులకు ఏమి మేలు చేస్తున్నారో చెప్పలేదని బిజెపి నేతలు మండిపడుతున్నారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు మంత్రుల బృందం వస్తున్నదని రైతులు ఆశగా ఎదురు చూశారని, తెలంగాణ మంత్రులు పర్యటించి వెళ్లిన తీరు చూస్తుంటే విహారయాత్రకు వచ్చి వెళ్లినట్లుగా ఉందని బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

మంత్రుల బృందం పర్యటన తర్వాత రైతులకు నిరాశే మిగిలింది
జనవరి 11న వడగండ్ల వానతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివధంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న, పసుపు, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయి ఆర్థికంగా మానసికంగా రైతులను కృంగతీసిన సందర్భంలో వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి లు వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం గారి దృష్టికి తాము తీసుకెళ్ళామని చెప్పారని విమర్శించారు. మంగళవారం వారు స్వయంగా వచ్చి పంట పొలాలను పరిశీలించి రైతులకు ఆదుకోనున్నారని ప్రచారం చేయడంతో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా మంత్రుల బృందం పర్యటన తర్వాత రైతులకు నిరాశే మిగిలిందని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు

రోడ్డు మార్గంలో కాక హెలికాఫ్టర్ లో వచ్చి మంత్రుల హడావిడి
కేవలం 200 నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి రోడ్డు మార్గంలో రావాల్సిన మంత్రుల బృందం హెలికాప్టర్ లో వచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగైదు ప్రాంతాలలో పర్యటించి కేవలం ఒకరిద్దరు ఎంపిక చేసిన రైతులను కలుసుకొని హంగామా చేసి వెళ్లారని, మంత్రులు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పంచ పాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురు అన్న చందంగా వారి పర్యటన పిక్నిక్ స్పాట్ కు వచ్చి వెళ్ళినట్లుగా సాగిందని రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు

పంట నష్టపోయిన రైతుల కోసం స్పష్టమైన ప్రకటన ఏది?
నర్సంపేటలో మంత్రులు నిర్వహించిన విలేఖర్ల సమావేశంలోనైనా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించామని కాని జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి గారు పరిశీలించి స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పి వెళ్లారని మండిపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా వారం రోజులు గడిచినా పంట నష్టం వివరాలుముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటివరకు సమాచారం లేదా? అని ప్రశ్నించారుమంత్రుల బృందం పర్యటన వల్ల ఎంతవరకు రైతులకు న్యాయం జరుగుతుందో చెప్పాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు

53 వేల ఎకరాల కంటే ఎక్కువగానే పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా
ఇప్పటివరకు అధికారులు కూడా పంట పొలాలను పరిశీలించి 53 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అంచనా వేశారని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పంట నష్టం జరిగిన వెంటనే బాధ్యత గల నాయకులుగా పంటపొలాలను తాము సైతం రెండు రోజులు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించామని రేవూరి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. 53 వేల ఎకరాల కంటే ఎక్కువగానే పంట నష్టపోయి ఉంటుందని వందకు వంద శాతం నష్టం జరిగినప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా పరిశీలించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ కు ఫాం హౌస్ లో తోటలు చూసుకోవడానికే సమయం సరిపోతుందేమో
ముఖ్యమంత్రి గారికి తన ఫాంహౌస్ లో ఉన్న తోటలను చూసుకోవడానికే సమయం సరిపోతుందేమోనని ఎద్దేవా చేశారు. మంత్రుల బృందానికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి పంపించి ఉంటారని భావించామని, మంత్రుల బృందం వచ్చి వెళ్లిన తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఏపాటిదో అర్ధం అవుతుందని పేర్కొన్నారు. రైతుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని గులాబీ నేతలు మరోసారి నిరూపించుకున్నారని ప్రకాశ్ రెడ్డి గారు విమర్శించారు. రైతులకు అండగా ఉంటామని మంత్రులు చెప్తున్న మాటలను గుర్తు చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఏ విధంగా అండగా ఉంటారో చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video

ఎకరానికి కనీసం 20వేలకు పైగా నష్ట పరిహారం చెల్లించి ఆదుకోండి
ఎకరాకు 40 వేల నుండి 50 వేల వరకు పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని వెంటనే రాష్ట్రప్రభుత్వం ఎకరానికి కనీసం 20వేలకు పైగా నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా కాకుండా కేవలం కంటితుడుపు చర్యలు చేపడితే బిజెపి ఊరుకోదని హెచ్చరించారు. రైతులతో కలిసి నష్ట పరిహారం చెల్లించే వరకు బిజెపిరైతులకు అండగా ఉండిపోరాడుతుందని రేవూరి ప్రకాశ్ రెడ్డి కేసీఆర్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications