రైతులను ఆదుకోలేని బీజేపి బ్యాంకులను లూటీ చేస్తున్న వారిని రక్షిస్తోంది..!శంషాబాద్ లో రాహుల్ ఫైర్
హైదరాబాద్ : సహాయం కోసం అర్థిస్తున్న రైతులగురించి పట్టించుకోని బీజేపి ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్న నీరవ్ మోదీ, చోక్సీ, మాల్యా లాంటి వారికి మాత్రం ఊడిగం చేస్తోందని ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. రాఫెల్ యుద్ద విమానాల కొనెగోలు కేవలం అంబానీ కుటుంబానికి మేలుచేసేందకే ప్రధాని మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. మోదీ చేతిలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రిమోట్ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. చంద్రశేఖర్ రావు బలహీనతలు మోదీ కి తెలుసు కాబట్టే అలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేసారు. రైతు రుణాలను కాంగ్రెస్ పార్టీ సమగ్రంగా మాఫీ చేసేందకు ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్షంగా నిధులు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారందరికి మెరుగైన జీవనోపాది కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ క్రుషి చేస్తుందని తెలిపారు. కేవలం 15మంది సంపన్నుల కోసం మోదీ పనిచేస్తున్నారని, పేదలు, సంపన్నులు గా దేశాన్ని మోదీ రెండు ముక్కలుగా చీల్చేసారని రాహుల్ మండిపడ్డారు. కాని కాంగ్రెస్ పార్టీ దేశంలో ధనిక పేద తేడా లేకుండా పనిచేస్తుందని తెలిపారు. చైనా దేశం భారత్ సరిహద్దైన డోక్లాం లోకి చొచ్చుకొస్తున్నా మోదీ ఎందుకు ఉదాసీనంగా వ్యవమరిస్తున్నారని ఆరోపించారు.
పుల్వామా లో మారణహోమం జరుగుతుంటే ప్రధాని మోదీ ఎన్జీసి ఛానల్ షూటింగ్ లో పాల్గొనడం దేశభక్తి కి నిదర్శనమా...? దేశభక్తులమని చెప్పుకునే బీజేపి, మోదీ ఇలా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలో యువత నిరత్సాహ పడాల్సిన అసరం లేదని, కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాది రంగాలపై ద్రుష్టి సారిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. నరేంద్ర మోదీ పరిపాలన పట్ల దేశ ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావడం ఖాయమని రాహుల్ తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications