Bandi Sanjay: విమానం కొన్నది ఆ ఇద్దరే.. ఒకరు కేఏ పాల్, మరొకరు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని ఎద్దేవా చేశారు. 2001లో టీఆర్‌ఎస్ ప్రారంభించిన సందర్భంలో ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వారిలో ఇప్పుడు ఎంత మంది ఉన్నారని చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అవినీతి
తనకు తెలిసి సొంత విమానం కొన్నది ఇద్దరే నాయకులని వారులో ఒకరు కేఏ పాల్ అయితే మరొకరు కేసీఆర్ అని తెలిపారు. కుమారుడిని సీఎంను చేయాలని. లిక్కర్ క్వీన్‌కు ఏదో విధంగా దిల్లీలో చేయూత ఇవ్వాలి అనేది కేసీఆర్ ఉద్దేశమన్నారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి చర్చకు వస్తుందనే కొత్త పార్టీ ప్రకటన హడావిడి చేస్తున్నారని విమర్శించారు.

ఏ ఒక్కరు సంతోషంగా లేరు
బుధవారం నాటి టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేశారు.. కానీ, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అని పేరు మార్చారని విమర్శించారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి బీఆర్‌ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

టూరిస్ట్
టీఆర్‌ఎస్ పేరుతో మునుగోడులో ఓటు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు సంజయ్. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మనది స్వయం పాలన.. జాతీయ పార్టీ నాయకులు టూరిస్టుల్లా వచ్చి పోతుంటారు అని విమర్శలు చేసిన కేసీఆర్.. టూరిస్టు మాదిరిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications