ముందస్తు అందుకేనా? మజ్లిస్‌కు భయపడి..: కేసీఆర్‌పై అమిత్ షా నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అంతేగాక, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానో పోటీ చేస్తుందని, ఎవరితో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణకు రూ.2.3 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కారు కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌తోపాటు కొత్త యూనివర్సిటీలను మంజూరు చేశామని వివరించారు.

ముందస్తుకు ఎందుకు?
ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు తమ నాయుడకు మోడీ పిలుపునిచ్చారని.. దేశంలో జమిలి ఎన్నికలను కేసీఆర్ కూడా తొలుత సమర్థించారని అమిత్‌షా గుర్తుచేశారు. జమిలి ఎన్నికలకు సమర్థించిన కేసీఆర్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు.

బీజేపీని మద్దతు పలికి..
ముందస్తు ఎన్నికలతో ప్రజలపై భారం మోపుతున్నారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని.. ఎన్నికల తర్వాత బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నామని.. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామగ్రామానికి వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అమిత్ షా తెలిపారు. బీజేపీని సమర్థించి.. రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.

కేసీఆర్ సర్కారు వైఫల్యాలు..
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అమిత్‌షా అన్నారు. టీఆర్ఎస్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. రెండున్నర లక్షల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేరిన ఒక్క జిల్లా ఉంటే చూపగలరా? అని నిలదీశారు. ఖమ్మంలో మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను అడ్డుకుంటే సిరిసిల్ల జిల్లాలో ఎస్సీలపై జరిగిన దాడులను ప్రజలు మరిచిపోలేదని అమిత్ సా అన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను ప్రపంచస్థాయి ఆస్పత్రులుగా మారుస్తామన్న హామి ఏమైందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కంటే రెట్టింపు నిధులిచ్చాం
‘ఓబీసీలకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తే మోడీ న్యాయం చేశారు. కాంగ్రెస్ ఎందుకు రాజ్యసభలో ఓబీసీ బిల్ ఆపింది. ట్రైబల్, వెటర్నరీ, జయశంకర్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశాం. ఎయిమ్స్‌కు రూ.1200 కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్ సర్కార్ కన్నా 20 రెట్లు అధికంగా తెలంగాణకు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ సర్కార్ లేకపోయినా ఫెడరల్ స్ఫూర్తికి గౌరవం ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామాల్లో తిరుగుతాం. కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజల మద్ధతు కావాలి. రాష్ట్రంలో, కేంద్రంలో మోడీ సర్కారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తెలిసినా.. మజ్లిస్‌కు భయపడి
‘జేపీకి ప్రజల మద్ధతు పెరిగింది. కేసీఆర్‌కు జనం మద్ధతు లేదు. తెలంగాణను మళ్లీ రజాకార్ల పాలనలో పెడతారా.. ప్రజలు ఆలోచించాలి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు చేయడం లేదు? మజ్లిస్‌కు భయపడే నిర్వహించడం లేదు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి పంపారు. కేసీఆర్‌కు తెలుసు... బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని.. అయినా బిల్లు పంపారు. కేసీఆర్ వస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తార'ని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాగా, హైదరాబాద్ వచ్చిన అమిత్ షాకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మధ్యాహ్నం లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో అమత్ షా పాల్గొంటారు.












Click it and Unblock the Notifications