తెలంగాణ ప్రజల్లో మార్పు: విభజన తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ తొలి స్పీచ్‌లో ఏమన్నారంటే?

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మొదటిసారిగా సభలో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీని గెలిపించారని గుర్తు చేశారు.

BJP will win in Telangana assembly elections: Kiran Kumar Reddy

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు అంటున్నారని తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని అన్నారు. కారు తాళాలు మనం తీసుకోవాలన్నారు. కారు స్టీరింగ్ తమ దగ్గర ఉందని పతంగి పార్టీ వాళ్లు అంటుంటారు.. తాళాలు తీసుకుంటే కారు ముందుకు వెళ్లదు అని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో జోష్ తెచ్చారని.. కిషన్ రెడ్డి పార్టీనీ అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2004లో సైకిల్ వెనకాల బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నారని తానే విమర్శించానని.. కానీ, ఇప్పుడు తానే బీజేపీలోకి రావాల్సి వచ్చిందన్నారు. బీజేపీకి ఎన్నికకు ఎన్నికలకు ఓట్లు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ సర్కారును గద్దె దింపి బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+