తెలంగాణాకు అమిత్ షాతో పాటు బీఎల్ సంతోష్.. సిట్ అధికారులు టచ్ చెయ్యగలరా?

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన అనుమానితుడు గా ఉన్న బీఎల్ సంతోష్ తెలంగాణ రాష్ట్రానికి త్వరలో రానున్నారు. ఇప్పటికే బి ఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని సిట్ అధికారులు విఫలయత్నాలు చేశారు. అనేకమార్లు కోర్టును ఆశ్రయించారు. అయినా కోర్టు బిఎల్ సంతోష్ ను అరెస్టు చెయ్యొద్దని, ఆయనకు ఇచ్చిన నోటీసులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ముందుకు వెళ్ళాలని భావించిన సిట్ అధికారులు కోర్టు ఆదేశాలతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి వచ్చింది.

తెలంగాణాకు బీఎల్ సంతోష్.. సిట్ అధికారులకు తలనొప్పి

తెలంగాణాకు బీఎల్ సంతోష్.. సిట్ అధికారులకు తలనొప్పి

ఇదిలా ఉంటే ఈనెల 28, 29 వ తేదీలలో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గ పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు, బిజెపిలో నెంబర్ 3గా చెప్పుకునే బి ఎల్ సంతోష్ కూడా వస్తున్నారు. ఇక ఈ పరిణామం సిట్ అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఎమ్మెల్యేల ఎర కేసులో మొదటి నుంచి బి ఎల్ సంతోష్ పేరు ప్రధానంగా వినిపించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి డీల్ మాట్లాడిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామిజీలు బి ఎల్ సంతోష్ ఆదేశాల మేరకే ఈ వ్యవహారాన్ని నడిపించారని, ఈ డీల్ పై మొదట్లోనే చర్చ జరిగింది.

హైదరాబాద్ కు బీఎల్ సంతోష్.. సిట్ అధికారులు ఏం చెయ్యబోతున్నారు?

హైదరాబాద్ కు బీఎల్ సంతోష్.. సిట్ అధికారులు ఏం చెయ్యబోతున్నారు?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేసును సిట్ అధికారులకు అప్పగించి దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు బి ఎల్ సంతోష్ కు నోటీసులిచ్చి విచారణ జరపాలని భావించినా ఇప్పటి వరకు ఆ పని చేయలేకపోయారు. ఇక బి యల్ సంతోష్ హైదరాబాద్ కు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతే ఎమ్మెల్యేల ఎర కేసు ప్రభావం పెద్దగా ఉండబోదని భావించాల్సిన పరిస్థితి వస్తుంది. కేసీఆర్ బీఎల్ సంతోష్ ను ఏమీ చెయ్యలేకపోయాడు అన్న చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపు సిట్ అధికారులు, ఆయనపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు మరోమారు కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.

బీఎల్ సంతోష్ రావటం కవ్వింపు చర్యనేనా?

బీఎల్ సంతోష్ రావటం కవ్వింపు చర్యనేనా?


ఇక బి యల్ సంతోష్ హైదరాబాద్లో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశాలలో పాల్గొననున్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో 60 పార్లమెంట్ నియోజకవర్గాల నుండి ముఖ్య కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించడం, ప్రచారాన్ని ఏవిధంగా సాగించాలి వంటి అనేక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ టీఆర్ఎస్ పొలిటికల్ హీట్ పుట్టించిన వేళ బీఎల్ సంతోష్ తెలంగాణాకు రావటం కవ్వింపు చర్యనే అని తెలుస్తుంది.

బీఎల్ సంతోష్ ను సిట్ టచ్ చెయ్యగలదా?

బీఎల్ సంతోష్ ను సిట్ టచ్ చెయ్యగలదా?


ఈ కేసులో గట్టిగా బిఎల్ సంతోష్ ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్న సిట్ ఒకవైపు, మీరు మమ్మల్ని చెయ్యలేరు అంటూ కవ్వింపు చర్యగా తెలంగాణ రాష్ట్రానికి రానున్న బి ఎల్ సంతోష్ ఒకవైపు రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, హైదరాబాద్లోనే పర్యటించనున్న బి ఎల్ సంతోష్ ను సిట్ అధికారులు టచ్ చేయగలరా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, తెలంగాణ ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+