కెసిఆర్ మనసు దోచుకున్న గండి రాకేష్: ఏం చేశాడు?, సిఎం హామి(పిక్చర్స్)
హైదరాబాద్: తొమ్మిదో తరగతి చదువుతున్న గండి రాకేష్ అనే విద్యార్థి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మనసు దోచుకున్నారు. చిన్న వయసులోనే కంటి చూపు మందగించినా బొమ్మలు గీయడాన్ని వదలలేదు రాకేష్. ఈ పట్టుదలే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆతిథ్యాన్ని సంపాదించి పెట్టి.. అతని కలను నిజం చేసింది.
వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన గండి రాకేష్ సిఎం కెసిఆర్‌కు వీరాభిమాని. చిన్నతనం నుంచే కెసిఆర్ చిత్రాలను గీస్తూ.. ఫొటోలు, వార్తలు, ప్రసంగాలను భద్రపరుస్తున్నాడు. అయితే రాకేష్‌కు నోట మాట సరిగా రాదు. గత కొంత కాలంగా కంటి చూపు కూడా మందగించింది. ఇటీవల విద్యుత్ శాఖమంత్రి జగదీష్‌రెడ్డి తొర్రూరుకు వెళ్లినప్పుడు రాకేష్ ఆయనను కలిశాడు.
తన కంటిచూపు పోయేలోగా సీఎం కేసీఆర్‌ను ఒకసారి కలవాలన్నది తన జీవిత ఆకాంక్షగా తెలిపాడు. వెంటనే జగదీష్‌రెడ్డి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన సీఎం రాకేష్‌ను ఆదివారం తన ఇంటికి ఆహ్వానించారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చిన రాకేష్‌కు తమ ఇంట్లోనే భోజనం పెట్టి, అతని యోగక్షేమాలు తెలుసుకున్నారు సిఎం కెసిఆర్.
ఈ సందర్భంగా రాకేష్ తాను గీసిన బొమ్మలను సిఎం కేసీఆర్‌కు అందజేశాడు. ముఖ్యమంత్రి వాటిని చూసి అభినందించారు. రాకేష్ కంటిచూపు పోకుండా ఆదుకుంటామని, మాట వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాకేశ్ భవిష్యత్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీనిచ్చారు. వెంటనే వైద్యసేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. బాగాచదివి ఉన్నతస్థాయికిఎదగాలని రాకేష్‌ను దీవించారు.

సిఎం కెసిఆర్‌ను కలిసిన రాకేష్
చిన్న వయసు నుంచే కుంచె పట్టుకుని బొమ్మలు గీస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థి గండి రాకేష్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మనసు దోచుకున్నారు.

సిఎం కెసిఆర్‌ను కలిసిన రాకేష్
చిన్న వయసులోనే కంటి చూపు మందగించినా బొమ్మలు గీయడాన్ని వదలలేదు రాకేష్. ఈ పట్టుదలే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆతిథ్యాన్ని సంపాదించి పెట్టి.. అతని కలను నిజం చేసింది.

సిఎం కెసిఆర్‌ను కలిసిన రాకేష్
వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన గండి రాకేష్ సిఎం కెసిఆర్‌కు వీరాభిమాని.

సిఎం కెసిఆర్‌ను కలిసిన రాకేష్
చిన్నతనం నుంచే కెసిఆర్ చిత్రాలను గీస్తూ.. ఫొటోలు, వార్తలు, ప్రసంగాలను భద్రపరుస్తున్నాడు. అయితే రాకేష్‌కు నోట మాట సరిగా రాదు. గత కొంత కాలంగా కంటి చూపు కూడా మందగించింది.

సిఎం కెసిఆర్‌ను కలిసిన రాకేష్
ఇటీవల విద్యుత్ శాఖమంత్రి జగదీష్‌రెడ్డి తొర్రూరుకు వెళ్లినప్పుడు రాకేష్ ఆయనను కలిశాడు.
తన కంటిచూపు పోయేలోగా సీఎం కేసీఆర్‌ను ఒకసారి కలవాలన్నది తన జీవిత ఆకాంక్షగా తెలిపాడు.

సిఎం కెసిఆర్‌ను కలిసిన రాకేష్
వెంటనే జగదీష్‌రెడ్డి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన సీఎం రాకేష్‌ను ఆదివారం తన ఇంటికి ఆహ్వానించారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చిన రాకేష్‌కు తమ ఇంట్లోనే భోజనం పెట్టి, అతని యోగక్షేమాలు తెలుసుకున్నారు సిఎం కెసిఆర్.

రాకేష్ గీసిన చిత్రం
ఈ సందర్భంగా రాకేష్ తాను గీసిన బొమ్మలను సిఎం కేసీఆర్‌కు అందజేశాడు. ముఖ్యమంత్రి వాటిని చూసి అభినందించారు. రాకేష్ కంటిచూపు పోకుండా ఆదుకుంటామని, మాట వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications