శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం వేళ హైదరాబాద్ షాక్ కు గురైన వార్త హల్ చల్ చేసింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయంలో బాంబులు పెట్టామని ఆగంతకులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర అధికారులు ఎయిర్ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
అయితే గతంలోనూ దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇది ఫేక్ బెదిరింపు ఈ- మెయిలా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరోవైపు సరిహద్దులో యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో బలగాలను పూర్తిస్థాయిలో మోహరించారు. 24 గంటల పాటు పూర్తి పర్యవేక్షణతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్ బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. ఎయిర్ పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications