శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..
గత కొంతకాలంగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇదిలా ఉండగా, నేడు (బుధవారం) ఉదయం మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా భయాందోళనలకు గురయ్యింది.
రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలతోపాటు చెన్నై నుంచి వచ్చిన ఓ విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది విమానాల్లో తనిఖీలు నిర్వహించారు.

స్పందించిన కేంద్రమంత్రి...
ఎయిర్‌పోర్టుల్లో, విమానాల్లో వరుస బెదిరింపు కాల్స్ వ్యవహారాన్ని కేంద్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు బాంబ్ బెదిరింపు విషయంపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ఈ విధంగా మాట్లాడారు. బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications