ఓ మొక్క దొంగిలించారని కేసు పెట్టిన రిటైర్డ్ డీజీపీ కుటుంబం ... ఇద్దరు అరెస్ట్,మొక్క స్వాధీనం
జూబ్లీహిల్స్ పోలీసులు ఒక కేసులో ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోవడం సహజమే కదా.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. కచ్చితంగా ఈ కేసులో వింత ఉంది. పోలీసులు దొంగలను పట్టుకున్నది ఏ కేస్ విషయంలోనో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.
రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన గూగుల్... అక్కడ రాజకీయ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం .. రీజన్ ఇదే !!

మొక్క మాయమైందని ఫిర్యాదు చేసిన రిటైర్డ్ డీజీపీ
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆసక్తికరమైన కేసు నమోదయింది. రిటైర్డ్ డీజీపీ ఒకరు తమ ఇంటి ఆవరణలో ఒక మొక్క మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిటైర్డ్ డీజీపీ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న రిటైర్డ్ డీజీపీ అప్పారావు ఇంటి ముందు ఒక అందమైన గార్డెన్ ను మెయింటైన్ చేస్తున్నారు.

రిటైర్డ్ డీజీపీ ఇంటి గార్డెన్ లో విలువైన బోన్సాయ్ మొక్క మాయం
ఆ గార్డెన్ లో ఉన్న అత్యంత విలువైన బోన్సాయ్ మొక్కను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఈనెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటమాలి మొక్కలకు నీళ్లు పోస్తుండగా, బోన్సాయ్ మొక్క కనిపించకపోవడంతో రచ్చ రిటైర్డ్ డీజీపీ కుటుంబానికి తెలియజేశారు. చాలా ఖరీదైన ఆ మొక్క కోసం రిటైర్డ్ డీజీపీ కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు .

దొంగలను పట్టుకున్న పోలీసులు .. మొక్క సేఫ్
సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగలను ట్రేస్ చేసిన పోలీసులు విలువైన మొక్కను స్వాధీనం చేసుకుని యజమానికి అందించారు. ఈ మొక్క విలువ 1,50,000 రూపాయలు ఉండడంతో రిటైర్డ్ డీజీపీ కుటుంబం మొక్క కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే కేసు ని తేల్చేసి దొంగలను అరెస్టు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.
మొత్తానికి మొక్క కోసం పోలీస్ కేసు పెట్టిన వింత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిధిలో చోటు చేసుకుంది .