ఆయుత చండీయాగంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్య, కేసు పెట్టాలని లాయర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లోకకల్యాణార్థం నిర్వహించిన ఆయుత చండీయాగం పైన విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని తెలంగాణ లాయర్ల జేఏసీ పోలీసులకు సోమవారం నాడు ఫిర్యాదు చేసింది.
కెసిఆర్ లోకకల్యాణం కోసం ఆయుత చండీయాగం నిర్వహించారని, అలాంటి కెసిఆర్ పైన రేవంత్ విమర్శలు సరికాదని వారు అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి యాత్రలకు వెళ్లినట్లు కెసిఆర్ యాగం నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారని మండిపడ్డారు.

కెసిఆర్ నిర్వహించిన చండీయాగం పైన విమర్శలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఓ వర్గాన్ని కించపరిచారని వారు అందులో పేర్కొన్నారు. కెసిఆర్ నిర్వహించిన యాగం పైన రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీన విమర్శలు చేశారని చెప్పారు.
రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని వారు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని పైన సెక్షన్ 295ఏ తదితరాల కింద కేసు నమోదు చేయాలన్నారు. దీని పైన తాము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?











Click it and Unblock the Notifications