హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ ట్వీట్ వైరల్ - వారి ప్రేమకు పొంగిపోయా : ఏపీ నేతలతో కలిసి...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఇప్పుడు సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శుక్రవారం ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం జరిగింది. ఈ వేడుకకు మంత్రి బొత్సా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక రంగాల ప్రముఖులను..రాజకీయ నేతలను ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి... నందమూరి బాలయ్య సైతం వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇక, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు విచ్చేసారు.

కేటీఆర్ ట్వీట్ ..ప్రేమాభిమానాలతో

అందులో భాగంగా.. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలు ఉన్నారు. ఈ వివాహానికి హాజరైన మంత్రి కేటీఆర్ అక్కడ లభించిన ప్రేమ గురించి ట్వీట్ చేసారు. కేటీఆర్ తన ట్వీట్ లో "నిన్న ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వెళ్లాను. వారి నుంచి లభించిన ప్రేమాభిమానాలు చూసి పొంగిపోయాను...అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులు శ్రీధ‌ర్ బాబు, సుద‌ర్శన్ రెడ్డి పాల్గొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం వివాహానికి హాజరయ్యారు.

ఏపీ - తెలంగాణ నేతలు ఆప్యాయంగా

ఏపీ - తెలంగాణ నేతలు ఆప్యాయంగా

బొత్సాతో సహా వైసీపీ నేతలు కేటీఆర్ కు స్వాగతం పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు కేటీఆర్ తో సఖ్యతగా వ్యవహరించారు. ఇక, తెలంగాణ మాజీ మంత్రులు శ్రీధర్ బాబు... సుదర్శన్ రెడ్డి పక్కనే కేటీఆర్ ఆసీనులయ్యారు. వారి మధ్య నవ్వుతూ మాటలు కలిసాయి. షబ్బీర్ అలీ.. కేటీఆర్ కలిసుకున్నారు. ఇక, వివాహానికి వచ్చిన వారు కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.

పలువురు ఫొటోలు తీసుకున్నారు. వైసీపీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు.. పార్ధసారధి.. జంగా క్రిష్ణమూర్తి వంటి వారు కేటీఆర్ తో చాలా సేపు మాట్లాడుతూ కనిపించారు.

Recommended Video

KCR ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టొద్దన్న Motkupalli Narasimhulu | Oneindia Telugu
సరదాగా...అందరూ కలిసి ఒకే చోట

సరదాగా...అందరూ కలిసి ఒకే చోట

సరదాగా జోకులు వేసుకుంటూ..ఒకరి తో మరొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉన్న వీడియోను కేటీఆర్ ఈ ట్వీట్ లో పోస్టు చేసారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రాష్ట్రాల నేతల మధ్య అభిమానాలు మాత్రం తగ్గలేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

దీనిని ఇప్పుడు అటు ఏపీ..ఇటు తెలంగాణ నేతలు లైక్ లు కొడుతున్నారు. భారీగా రీట్వీట్ లు చేస్తున్నారు. మరి కొంత మంది షేర్ చేస్తున్నారు. దీంతో...ఏపీ - తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Telangana Minister KTR who attended Botsa's sons marriage met few AP leaders and shared his experience with AP leaders with a tweet that has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X