దొంగతనం చేస్తూ పట్టుబడి, అవమానంతో ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన శాంసన్, సువర్ణ దంపతుల కుమారుడు రిక్కీ జేమ్స్ దొంగతనం చేస్తూ పట్టుబడి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో రికీ జేమ్స్ 8వ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం రాత్రి సమయంలో కాలనీలోని కిరాణా దుకాణానికి బిస్కట్లు కొనుక్కోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో వారి కోసం పిలిచాడు. వారు వచ్చేలోగా దుకాణంలోని గల్లా పెట్టె తెరిచి ఉండడంతో ఆందులోంచి డబ్బులను దొంగలించే ప్రయత్నం చేశాడు. అది గమనించిన షాపు యజమానికి నీలదీయడంతో డబ్బు తిరిగి ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ విషయాన్ని కిరాణా షాపు యజమాని బాలుడి తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సమీపంలోని వారి బంధువులకు చెప్పాడు. అప్పటికే బాలుడు తన ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
అది గమనించిన బంధువులు తలుపులు బద్దలు కొట్ిటి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications