ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన:పురుగుల మందు తాగిన ప్రియుడు.. ఆసుపత్రిలో మృతి
ప్రియురాలు తన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో.. మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంథని: ప్రియురాలు తన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో.. మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించిన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న కారణంతో ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యువతి తన ఇంటి ముందుకు వచ్చిందని తెలియగానే.. ఇంటి నుంచి పారిపోయిన రజనీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని మంథని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి మృతితో అతని కుటుంబ సభ్యులు, బంధువులు యువతిపై దాడికి దిగారు. దీంతో సింధు, ఆమె తల్లి, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.
కర్రలు, రాళ్లతో దాడి చేశారని, తన మెడను కాళ్లతో తొక్కారని వాపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంథని ఎస్‌ఐ ఉపేందర్ గ్రామానికి వెళ్లి దాడికి పాల్పడ్డవారిని అదుపు చేశారు.
గాయపడ్డవారిని తమ వాహనంలో మంథని ఆస్పత్రికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications