జగ్గారెడ్డి రాజీనామాకు బ్రేక్: నేడు కార్యకర్తలతో సమావేశంపై ఉత్కంఠ; డైలమాలో కాంగ్రెస్
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అధిష్టానానికి జగ్గారెడ్డి రాసిన లేఖలో తాను కాంగ్రెస్ పార్టీలో లేనంటూ తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీ సీనియర్ల సంప్రదింపులతో జగ్గారెడ్డి కాస్త మెత్తబడినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన జగ్గారెడ్డి పదిహేను రోజుల పాటు రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు.
Recommended Video

పదిహేను రోజుల పాటు రాజీనామాకు జగ్గారెడ్డి బ్రేక్
పదిహేను రోజుల పాటు రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న జగ్గారెడ్డి ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. తాను పార్టీలో ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ముందు జగ్గారెడ్డి చెప్పుకున్నారు. వాటిపై అధిష్టానంతో మాట్లాడదామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి కి హామీ ఇచ్చారు. అయితే ఆయన తనను సోనియాగాంధీకి తో లేదా రాహుల్ గాంధీ తో కల్పిస్తే ఉంటానని, లేదంటే వెళ్లిపోతానని పార్టీ పెద్దల అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం.

సీఎల్పీ కార్యాలయంలో భట్టితో భేటీ అయిన జగ్గారెడ్డి
గురువారం నాడు సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తానే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పార్టీలో ఇతర నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కారణంగా పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదు అని భావించే తాను పార్టీని వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు.

రాజీనామా విషయంలో ఆయన వెనక్కు తగ్గినట్టే అన్న భట్టి.. కానీ
జగ్గారెడ్డి మాట్లాడిన అంశాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని జగ్గారెడ్డి పార్టీని వీడరని, రాజీనామా విషయంలో వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తల చేతిలో పెట్టారు జగ్గారెడ్డి. పార్టీని వీడాలా ? వద్దా? అన్న ప్రశ్నలతో నియోజకవర్గ కార్యకర్తలకు ఆయన మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇక వారి నిర్ణయాన్ని బట్టే పార్టీ మార్పు ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్నారు.

నేడు కార్యకర్తల సమావేశం, జగ్గారెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ
ఇదిలా ఉంటే నేడు జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పైన కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే రాజీనామాకు కార్యకర్తల సమావేశానికి సంబంధంలేదని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఇదే విషయాన్ని బట్టి విక్రమార్క కూడా చెబుతున్నారు. రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నట్లు గా జగ్గారెడ్డి చెప్పకపోవడం, ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నానని మాత్రమే ప్రకటన చేయడం, మరోపక్క కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం ఆసక్తిని రేపుతున్నాయి. జగ్గారెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమౌతుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications