బెదిరిస్తే భయపడతానా.. అసదుద్దీన్ ఓవైసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్!!
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారం ఇప్పుడు నిజామాబాద్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే బక్రీద్ పండుగ సందర్భంగా ఈ కేసులో అరెస్టయిన అల్తాఫ్ తండ్రి అబ్దుల్ బాకీ ఖురాన్ నెత్తిన పెట్టుకొని తన కొడుక్కి ఏ పాపం తెలియదని కన్నీరుమున్నీరు అయ్యాడు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని దర్గా వద్ద నిన్న బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేయగా, నమాజ్ ముగిసిన తర్వాత అల్తాఫ్ తండ్రి అబ్దుల్ బాకీ వేదికపైకి ఖురాన్ తో వచ్చి తన కొడుకుకు ఏ పాపం తెలియదని బోరున విలపించాడు. దీంతో ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే షకీల్ ఒక వీడియోని విడుదల చేశారు.

తన హత్యకు కుట్ర చేశారని, సొంత పార్టీలోనే కౌన్సిలర్లు, ఎంఐఎం నేతలు ముఠాగా ఏర్పడి తనపై దాడి చేశారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని వ్యాఖ్యలు చేశారు. అందువల్లే పోలీసులు నిందితులను జైలుకు పంపారని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. జైలులో ఉన్న ఇద్దరు ఎంఐఎం యువకులకు నేర చరిత్ర ఉందని, వారికి సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు.
ఇక ఇదే సమయంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. అసదుద్దీన్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎన్నికల సమయంలో ఆయన నైజం బయట పెడుతున్నారు అని మండిపడ్డారు. ఎన్నికలలో చూసుకుంటామని బెదిరిస్తే భయపడేవాడిని ఎవరూ లేరని, దమ్ముంటే ముందు నుంచి కొట్లాడాలని వెనక నుంచి కాదని పేర్కొన్నారు.

ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం రమ్మని షకీల్ సవాల్ విసిరారు. బోధన్ ప్రజలు తనతోనే ఉన్నారని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. తాను ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదని తన పైన హత్యాయత్నం చేస్తేనే కేసు పెట్టానని పేర్కొన్నారు. జైల్లో ఉన్న నిందితులపై దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా చాలా కేసులు ఉన్నాయి అన్నారు.
బోధన్ బి ఆర్ ఎస్ నేత శరత్ రెడ్డి, ఎం ఐ ఎం నేతలతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఎంఐఎం బెదిరింపులకు భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. మొత్తానికి బీఆర్ఎస్ నేత షకీల్ ఎంఐఎం అధినేతకు సవాల్ విసరటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications