అలంపూర్ అభ్యర్థిని మార్చిన బీఆర్ఎస్: మిగిలిన 9 స్థానాలకు అభ్యర్థులు వీరే
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ భీపారాల పంపిణీ పూర్తయింది. ఇప్పటికే 110 మంది అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వగా.. మంగళవారం మిగిలిన తొమ్మిది స్థానాలకు పంపిణీ పూర్తి చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అభ్యర్థులకు బీఫారాలు అందించారు. గతంలో ప్రకటించిన అలంపూర్ అభ్యర్థిత్వాన్ని మార్చారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ వారికి బీఫామ్స్ అందించి అభినందించారు. అలంపూర్‌కు గతంలో ప్రకటించిన అబ్రహంకు కాకుండా విజేయుడికి బీ ఫామ్ అందించారు. గోషామహల్ అభ్యర్థిగా నంద కిషోర్ వ్యాస్, నాంపల్లి అభ్యర్థి అనంద్ కుమార్ గౌడ్‌ను ఖరారు చేశారు. వీరికి బీఫాం అందించడంతో మొత్తం 119 మందికి బీ ఫాం అందించడం పూర్తి అయింది.

9 స్థానాల్లో అభ్యర్థులు వీరే:
1. చాంద్రాయణ గుట్ట -ఎం.సీతారాం రెడ్డి
2. యాకత్ పురా - సామా సుందర్ రెడ్డి
3. బహుదూర్ పుర - ఇనాయత్ అలీ బక్రీ
4. మలక్ పేట- తీగల అజిత్ రెడ్డి
5. కార్వాన్ - అయిందాల కృష్ణ
6. చార్మినార్ - సలావుద్దీన్ లోడి
7. నాంపల్లి - సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్
8. గోషామహాల్ - నంద కిషోర్ వ్యాస్
9. అలంపూర్ - విజేయుడు
తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీ. జనసేన పోటీ చేసే 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను మంగళవవారం ప్రకటించింది.
కూకట్‌పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి.












Click it and Unblock the Notifications