రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు: కాంగ్రెస్ యాడ్స్‌పై ఈసీ బ్యాన్!
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్తలను రెచ్చగొడుతూ దుర్భాషలాడుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రేవంత్‌పై నిషేధం విధించాలని కోరింది. ఈ మేరకు సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
రేవంత్ రెడ్డి పదే పదే కార్యకర్తలను రెచ్చగొడుతూ దాడులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఆరోపించారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కనీసం ఖండించకుండా కామెడీ చేస్తున్నారని అన్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని భరత్ కోరారు. రేవంత్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. నిషేధించిన ప్రకటనను బ్యాన్డ్ అని పెట్టి మరీ కాంగ్రెస్ నేతలు ప్రసారం చేస్తున్నారని సోమా భరత్ మండిపడ్డారు.
మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఈసీ నిషేధం.
— Telangana Congress (@INCTelangana) November 13, 2023
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటనలపై బ్యాన్ వాటర్ మార్క్.
ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్ & బిజెపి పార్టీల ఒత్తిడితోనే ఈసీ నిర్ణయం.#ByeByeKCR pic.twitter.com/k7tBjEdme6
ఇది ఇలావుండగా, కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలపై నిషేధం విధించారు. ఈ క్రమంలో 'మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఈసీ నిషేధం. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటనలపై బ్యాన్ వాటర్ మార్క్. ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్, బిజెపి పార్టీల ఒత్తిడితోనే ఈసీ నిర్ణయం' అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
కేసీఆర్‌ను పోలిన వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను రూపొందించి సోషల్ మీడియా, మీడియా ఛానళ్లలో ప్రసారం చేయిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications