భయం వద్దు, ఫోన్ చేస్తే గంటలో మీ ముందుంటా - హరీష్..!!

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను కేసులతో ఇబ్బంది పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. ఎవరూ భయడపడొద్దని సూచించిన హరీష్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేశారు.. ఈ నిజం అతి త్వరలోనే తెలుస్తోందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు సహజం.. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటుకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌స‌భ‌లో బుధ‌వారం జీరో అవ‌ర్ జ‌రుగుతుండ‌గా విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి ఇద్దరు ఆగంత‌కులు కింద‌కు దూకి గ్యాస్‌ను వ‌ద‌లడంపై మంత్రి స్పందించారు. పార్లమెంట్‌కే రక్షణ కల్పించని కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి భద్రత కట్టదితం చేయాలన్నారు. అధికారం కోల్పోవడం కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎప్పుడు అందు బాటులో ఉంటూ ఫోన్ చేస్తే గంటలోపే మీ ముందుంటానని హామీనిచ్చారు.

BRS leader Harisha Rao made sensational comments on Congress govt

బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం . స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేద్దామన్నారు. అధికార పార్టీ నాయకులు మానసికంగా ఇబ్బంది పెడతారు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దన్నారు. తాము కేసులు పెట్టుంటే సగంమంది కాంగ్రెస్‌ నేతలు జైల్లో ఉండేవారంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ పనితనం తప్ప, పగతనం తెలియని నాయకుడని.. వివరించారు. అందుకే, కొత్త రాష్ట్రంలో కక్షలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిపెట్టామని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హౌజింగ్‌ స్కామ్‌లో ఎంతోమంది కాంగ్రెస్‌ నేతల పేర్లున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేశారు.. ఈ నిజం అతి త్వరలోనే తెలుస్తోందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. పనిమంతులు ఎవరు అనేది త్వరలోనే ప్రజలే గమనిస్తారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+