రాజీ పడొద్దు: ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ భేటీపై వినోద్ కుమార్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా చేయవద్దంటూ సూచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ వనరులపై ఏపీ వారు కన్నేశారని ఆరోపించిన వినోద్ కుమార్.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దన్నారు. తెలంగాణ ఆస్తులను పోగోట్టుకోరాదని సూచించారు.

ఢిల్లీ తెలంగాణ భవన్ విభజనలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగరాదని వినోద్ స్పష్టం చేశారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. రేపటి(ఆదివారంనాటి) సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని వినోద్ కుమార్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

BRS Leader Vinod Kumar response on Telugu states CMs Meeting

జమ్మూ, కాశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారు కానీ, ఈ విజ్ఞప్తిపై స్పందించలేదన్నారు వినోద్ కుమార్. శాసనమండలిలో కనీసం 40 మంది, అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మూడో వంతు ఉండాలని, ఆంగ్లో ఇండియన్ కలిపితే రాష్ట్ర శాసనసభలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని వినోద్ చెప్పుకొచ్చారు. లోక్ సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోడీ ప్రభుత్వం తొలగించిందని, దీంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 మాత్రమేనని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మండలి రాజ్యాంగ ప్రకారం లేదని.. ఇపుడు ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దు అవుతుందని వినోద్ కుమార్ తెలిపారు. ఇపుడు మంచి అవకాశం వచ్చిందని, రేపటి సీఎంల సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు. కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దని సీఎం రేవంత్ రెడ్డికి వినోద్ సూచించారు. కాగా, ఆదివారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+