దానం తరువాతి వికెట్ ఆయనే, అధారాలు పక్కా..? కేసీఆర్ ఫిక్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన మరింత ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా దానం తరువాత మరో సీనియర్ నేత పైన గురి పెట్టింది. న్యాయ పరంగా పూర్తి ఆధారాలతో టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసారు. దీంతో.. ఇప్పుడు ఈ సీనియర్ నేత విషయంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వారిలో దానం నాగేందర్ పైన తాజాగా హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు పైన దానం సుప్రీం ను ఆశ్రయించారు. బుధవారం ఈ కేసు విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో దానం తరువాతి వికెట్ ఎవరనే అంశం అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ లోనూ ఆసక్తిగా మారుతోంది. అయితే.. దానం తరహాలో పూర్తి ఆధారాలతో కడియం శ్రీహరిని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కడియం శ్రీహరి మీద బీఆర్ఎస్ వేసిన పిటీషన్ త్వరలోనే విచారణకు వస్తుందని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన కూతురు కడియం కావ్య పోటీ చేయడం, అందులో నామినేషన్ పత్రాల మీద కడియం శ్రీహరి సంతకాలు చేయడమే కాకుండా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారని గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరిన అంశాలను బీఆర్ఎస్ ప్రధానంగా కోర్టులో విచారణ సమయంలో ప్రస్తావించాలని డిసైడ్ అయింది. తమ కుమార్తె కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సమయంలో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన ఆధారాలతో కడియం పైన అనర్హత వేటు పడుతుందని గులాబీ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తాజాగా హైకోర్టు దానం నాగేందర్ పైన అనర్హత వేలు వేసింది. అదే విధంగా కడియం తో పాటుగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడమే కాకుండా, సహాయ మంత్రి హోదా ఇవ్వడం ఆయనకు న్యాయ పరంగా ఇబ్బందిగా మారుతుంది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మారిన వారి పైన న్యాయ పరంగా పోరాటం కొనసాగించాలని డిసైడ్ కావటంతో వీరి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.













Click it and Unblock the Notifications
