అసెంబ్లీలో కేటీఆర్ కేసు ప్రకంపనలు - దూసుకెళ్లిన హరీష్..!!
తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేటీఆర్ పైన నమోదైన కేసు పైన చర్చకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవటం తో పోడియం వద్దకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించే సమయంలో వాగ్వాదం .. తోపులాట చోటు చేసుకుంది. ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోడియం వద్దకు చొచ్చుకొచ్చారు. హరీష్ పోడియం ఎక్కేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ అడ్డుకున్నారు.
కేటీఆర్ కేసు పై
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. బీఆర్ఎస్ సభ్యుల గొడవతో సభ హోరెత్తింది. కేటీఆర్ అరెస్ట్ పైన చర్చించాలని.. సభ జరుగుతున్న సమయంలో సభ్యుడి పైన కేసు నమోదు అవ్వటంతో.. సభలోనే సభ్యుడు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి ఇదే గొడవ కొనసాగుతోంది. కాగా, బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్ ను స్పీకర్ తోసి పుచ్చారు. ఆ సమయంలో అటు కాంగ్రెస్ .. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటంతో స్పీకర్ సభను వాయిదా వేసారు.

దూసుకొచ్చిన హరీష్
ఆ తరువాత తిరిగి సమావేశమైన సభలో అదే పరిస్థితి కొనసాగింది. హరీష్ రావు స్పీకర్ పోడియం వద్దకు ప్లకార్డులతో దూసుకొచ్చారు. సభలోకి ప్రవేశించిన మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ సభ్యులు మార్షల్స్ ను తోసేసి పోడియం మీదకు వెళ్లే ప్రయత్నం చేసారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు విజువల్స్ బయటకు వచ్చాయి. అంతకు ముందు స్పీకర్ పోడియం పైన బీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చింపి విసిరేసారు. కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రతిఘటించారు. దీంతో, రెండు వైపుల నుంచి వాగ్వాదంతో పాటుగా సవాళ్లు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన పైన ఇతర పక్షాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు.
కొనసాగుతున్న రచ్చ
బీఆర్ఎస్ సభ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బర్ డిమాండ్ చేసారు. నిరసనల మధ్యనే భూ భారతి పైన చర్చ కొనసాగుతోంది. హరీష్ స్పీకర్ పోడియం పైకి ఎక్కే ప్రయత్నం చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెడ్ ఫోన్ ను విసిరేసేందుకు ప్రయత్నం చేసారు. అదే సమయంలో కాగితాలను విసిరేసారు. దీంతో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు దూసుకొచ్చారు. అటు కేటీఆర్ తన కేసు పైన హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అల్లర్లకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపణ చేసింది. ఇటు కేటీఆర్ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications