ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల- బీఆర్ఎస్ నేత లాజిక్ ఇదీ..!!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే- ఆమె ముఖ్యమంత్రి అవుతుందని అన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి.. వార్షిక బడ్జెట్ కు సంబంధించిన విమర్శల సునామీని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై మండిపడుతున్నారు. దీన్ని ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తోన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, స్థలాలు, రుణ మాఫీ గురించి ప్రస్తావించలేదని, హరీష్‌ రావు అంకెల గారడీ తప్ప బడ్జెట్‌ లో ఏమీలేదని విమర్శించారు.

కొత్త సీసాలో పాతసారా..

కొత్త సీసాలో పాతసారా..

ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్ కు వెళ్లారని, ఆయన మామ కేసీఆర్ అందులో పాత సారా పోసి పంపించారని ఎద్దేవా చేసారు. గత ఏడాదికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ప్రజల ముందు ఉంచగలరా? అని ప్రశ్నించారు. కొత్త ప్రతిపాదనలేవీ లేవని, గత ఏడాది బడ్జెట్ లోని అంశాలనే కాపీ పేస్ట్ చేశారనీ చురకలు అంటించారు.

కడియం శ్రీహరి అటాక్..

కడియం శ్రీహరి అటాక్..

వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు కడియం శ్రీహరి ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా లాగారు. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం, వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సీబీఐ చేపట్టిన దర్యాప్తు విషయాన్నీ ప్రస్తావించారు.

త్వరలో జైలుకు..

త్వరలో జైలుకు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనో.. సీబీఐ కేసులోనో వైఎస్ జగన్ రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమని, అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలకు అవకాశం లభిస్తుందని అన్నారు. తెలంగాణ గురించి ఏమీ తెలియని షర్మిల ఏకంగా బడ్జెట్‌ పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణకు వైఎస్ కుటుంబం మొదటి నుంచీ వ్యతిరేకమేనని ఆరోపించారు. గతంలో సమైక్యాంధ్ర నినాదంతో షర్మిల పాదయాత్ర చేశారని విమర్శించారు.

తెలంగాణకు షర్మిల అవసరం లేదు..

తెలంగాణకు షర్మిల అవసరం లేదు..

సమైక్యాంధ్ర కోసం పని చేసిన షర్మిల లాంటి నాయకులు తెలంగాణ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై మాట్లాడటం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణకు ఆమె అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏపీకి వెళ్లి అక్కడ రాజకీయాలు చేసుకోవచ్చని, దానికి ఎవరి అభ్యంతరం ఉండదని సూచించారు. ఏపీకి వెళ్లి అక్కడి ప్రజలకు మెురపెట్టుకోవాలని అన్నారు. రేపోమాపో జగన్ జైలుకు పోతే ఏపీలో ముఖ్యమంత్రిగా షర్మిలకే అవకాశం వస్తుందని వ్యాఖ్యానించారు.

జగన్ జైలులో ఉన్నప్పుడూ..

జగన్ జైలులో ఉన్నప్పుడూ..

జగన్ ఇదివరకు జైలులో ఉన్నప్పుడు కూడా షర్మిల పాదయాత్ర చేశారని, ఇప్పుడు కూడా తెలంగాణలో ఊరూరా తిరుగుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. దీనివల్ల తెలంగాణలో ఆమెకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని చెప్పారు. ఏపీకి వెళ్తే సీఎం అవుతుందని అన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిలకు అన్యాయం చేశారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడం వల్ల లాభం ఉండదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+