హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత మరో ఉద్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో ముందడుగు వేశారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

'మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు' అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

వచ్చే నెల(ఏప్రిల్)లో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు ఆమె పోస్టు కార్డులు రాయాలని కార్యచరణను తయారు చేశారు. ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విషయం తెలిసిందే.

 BRS mlc kalvakuntlas movement for womens reservation

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపైనా కవిత స్పందించారు. వెంటనే రాహుల్‌పై వేసిన అనర్హత వేటును ఎత్తేయాలని అన్నారు. మోడీ ప్రభుత్వం తమ వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే ఈ చర్యకు దిగారని ఆరోపించారు.

English summary
mlc kalvakuntla's movement for women's reservation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X