బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ పాలసీ, సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 5కి వాయిదా వేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు.. జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచాలని సీబీఐని ఆదేశించింది.
అలాగే, చార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న చార్జిషీట్ దాఖలు చేసింది.

కవితను కలవనున్న కేటీఆర్
కవిత అనారోగ్యానికి గురైన క్రమంలో ఆమెను కలిసేందుకు సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కవితకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల అనంతరం నివేదికను అందించాలని న్యాయస్థానం ధర్మాసనం ఆదేశించింది.
కాగా, గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను జైలు అధికారులు కోర్టుకు హాజరుపర్చారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు కవిత. ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత లాయర్లు వేసిన పిటిషన్ విచారణ సందర్బంగా కవిత తన విన్నపాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే అస్వస్థత కారణంగా దీన్ దయాళ్ ఆస్పత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ విచారించిన కోర్టు.. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications