ఎమ్మెల్సీ కవితకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం: తెలంగాణపై ప్రత్యేకం
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డెవలప్మెంట్, ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించేందుకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. అక్టోబర్ 30న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కవిత ప్రసంగించనున్నారు.
లండన్‌లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ఈనెల 30న ప్రసంగించేందుకు రావాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోరింది. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి.. తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్, కులవృత్తులకు ప్రోత్సాహం, మిషన్ భగీరథ, విద్య, వైద్య రంగాల్లో పురోగతిని వివరించనున్నట్లు కవిత తెలిపారు.

ఇది ఇలావుంటే, దసరా వేడుకల్లో భాగంగా కవిత నిజామాబాద్ వెళ్లారు. నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలసి పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మపై తాను రాసి, పాడిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.
దసరా పండగ అంటే మహిళల విజయమని, 9 రోజులపాటు బతుకమ్మ పండగ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. దసరా పండగ అంటేనే మహిళల విజయమని.. ప్రజలు సంతోషంగా ఉంటేనే పండగలు వైభవంగా జరుగుతాయని అన్నారు. ప్రజలకు మంచి చేసే వారికి సముచిత స్థానం కల్పించాలని తెలిపారు.












Click it and Unblock the Notifications