కల్వకుంట్ల కవిత అరెస్టులో కోర్టు సంచలన ఆదేశాలు
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో పడ్డారు. ఈ కేసుపై విచారణ జరుపుతోన్న ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం సంచలన ఆదేశాలను జారీ చేసింది.
అప్పటి వరకు రిమాండ్..
కవితకు రిమాండ్ విధించింది. ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీకి తరలించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ అధికారుల కస్టడీలో ఉండాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు.

పీఏ స్టేట్‌మెంట్..
ఈ కేసులో శుక్రవారం కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. తొలుత ఆమె నివాసంపై ఈడీ అధికారులు దాడులకు దిగారు. విస్తృత సోదాలను చేపట్టారు. అయిదు గంటలకు పైగా ఈ తనిఖీలు కొనసాగాయి. ఆమె మాజీ పీఏ అశోక్ కౌశిక్ స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలపై కవిత ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
10 రోజుల కస్టడీ..
అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఈ మధ్యాహ్నం రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కవితను విచారించడానికి 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు.. న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చోటు చేసుకుందని, దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని కోరారు.

కోర్టు దృష్టికి కేసు పురోగతి..
ఇప్పటివరకు చోటు చేసుకున్న పురోగతినీ వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్.. విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. వారంతా ప్రస్తుతం జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. మరికొందరు ఇతర పార్టీల నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు.
23వ తేదీ వరకు..
దీనిపై వాదోపవాదాలను ఆలకించిన అనంతరం న్యాయమూర్తులు కవితను ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. నిజానికి- ఈడీ అధికారులు 10 రోజుల పాటు కస్టడీ కోరగా.. దీన్ని న్యాయమూర్తులు తిరస్కరించారు. వారం రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.












Click it and Unblock the Notifications