రేవంత్ పై కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం - పోరాటంతో ప్రజల్లోకి..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వం పైన తొలి పోరాటానికి సిద్దమయ్యారు. సీఎం రేవంత్ లక్ష్యంగా రాజకీయ యుద్దానికి సై అంటున్నారు. ఇందు కోసం కార్యాచరణ ఖరారు చేసారు. సమర్ధవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే..కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని చెబుతున్న కేసీఆర్ ఇదే అంశాన్ని అస్త్రంగా మలచుకొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.

కేసీఆర్ పోరాటం : రేవంత్ ప్రభుత్వం పైన కేసీఆర్ తొలి అస్త్రం సంధించారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రతిపక్షంలో ఉంటూ సమర్ధంగా పని చేద్దామని సూచించారు. రాష్ట్ర హక్కులను దెబ్బతీసే ప్రాజెక్టుల అప్పగింత పై ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎలా పనిచేందీ, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సి ఉందని చెప్పారు.

BRS President KCR decides to fight against Revanth govt Decision on Handover projects to KRMB

సభలతో ప్రజల్లోకి : ఇదే అంశం పైన సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ వేదికగా సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించటానికి ఒప్పుకోలేదని కేసీఆర్ స్పష్టం చేసారు. బలవంతంగా గజెట్ అమలు చేయటానికి ప్రయత్నస్తే కృష్ణా లో50 శాతం వాటా కోసం పట్టబట్టామని తెలిపారు. రెండు రాష్ట్రాలకు 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల విషయం అపెక్స్ కౌన్సిల్ తేల్చాలని కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయించినా, తరువాత అపెక్స్ కౌన్సిల్ సమావేశమే జరగలేదని చెప్పారు.

BRS President KCR decides to fight against Revanth govt Decision on Handover projects to KRMB

రేవంత్ అలర్ట్ : ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లోని పది ఔట్ లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని, అదే జరిగే రాష్ట్ర హక్కులను కోల్పోతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశం పైన ఈ మధ్నాహ్నం సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయంలో ఏం జరిగిందీ వివరించనున్నారు. అటు కేసీఆర్ ఇదే అంశం పైన పోరాటానికి సిద్దమవుతున్న వేళ..రేవంత్ నిర్ణయాలు ఏంటీ.. కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+