Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ పార్టీ అధికారంలోకి వస్తే అధోగతే: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ హెచ్చరిక

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని.. లేదంటే గోసపడతామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్, ధర్మపురి, బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? అని కాంగ్రెస్‌పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్ర‌జాస్వామ్యంలో ఓటు వ‌జ్రాయుధం.. ఆ ఓటు నీత‌ల‌రాత‌ను మారుస్త‌ది.. నీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యం చేస్త‌ది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు ప‌రిపాలించింది. మ‌ళ్లీ ఇవాళ వ‌చ్చి ఒక్క‌సారి మాకు ఛాన్స్ ఇవ్వండ‌ని అంటున్న‌రు. ఎందుకు పంటికి అంట‌కుండా మింగుదామ‌నా? దేనికి మీకు? ఒక్క సారి కాదు.. 11, 12 సార్లు ఛాన్స్ ఇచ్చారు. మీకు ఇవ్వ‌లేద‌ని కాదు. ఈశ్వ‌ర్ ఎమ్మెల్యే అయ్యాక ధ‌ర్మ‌పురి ఎలా ఉంది.. అంత‌కుముందు ఎట్ల ఉండేనో తేడా గ‌మ‌నించాలి. టెయిల్ ఎండ్ కాలువ‌లు ఉన్నాయి.. ఆ రోళ్ల‌వాగు ప్రాజెక్టు అని స‌తాయించిండు. నా వెంట‌ప‌డి ఆ ప‌నులు చేయించాడు. ఇవాళ దాదాపు 1 ల‌క్ష 30 వేల ఎక‌రాలు సాగు అవుతుంది. ఈ తేడాను మీరు గ‌మ‌నించాలని కేసీఆర్ సూచించారు.

BRS should win third time: KCR slams congress and bjp in today public meetings

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. కరెంటు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్ అందుతోందన్నారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ప్ర‌ధాని మోడీకి ఓ పిచ్చి ప‌ట్టుకుందని విమర్శించారు. అదే ప్ర‌యివేటైజేష‌న్.. రైళ్లు, ఓడ‌రేవులు, విమానాలు ప్ర‌యివేటైజేష‌న్.. ఆఖ‌రుకు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి బిల్లులు వ‌సూళ్లు చేయాల‌ని చెప్పిండు. చ‌చ్చినా స‌రే పెట్ట‌ను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాను. మ‌న‌కు రావాల్సిన ఏడాదికి 5 వేల కోట్లు క‌ట్ చేశారు. 25 వేల కోట్లు న‌ష్ట‌పోతూ కూడా మీట‌ర్లు పెట్ట‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా మీట‌ర్లు పెట్టం. ఈ తేడాను గ‌మ‌నించాలన్నారు కేసీఆర్.

అంత‌కుముందు రైతుబంధు లేదు.. రాబందులే త‌ప్ప రైతుబంధులు లేరు అని కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శించారు. పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. పైస‌లు కూడా వెంట‌నే జ‌మ చేస్తున్నాం. వెంట‌నే మీరు బ్యాంక్‌కు వెళ్లి తీసుకుంటున్నారు. ధ‌ర‌ణిని తీసేస్తామ‌ని రాహుల్ గాంధీ అంటున్నారు.. ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌చ్చిన త‌ర్వాత భూములు సేఫ్‌గా ఉన్నాయి. మండ‌ల కేంద్రాల్లోనే రిజిస్ట్రేష‌న్లు అయిపోతున్నాయి. ద‌ళారీ లేడు, రూపాయి లంచం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ‌లో పొర‌పాటున‌ కాంగ్రెస్ గెలిస్తే.. మ‌ళ్లా పైర‌వీకారులు పుట్టుకొస్త‌రు.. కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుతుంద‌ని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
రైతుబంధుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ర‌కాలుగా మాట్లాడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. రైతులు అంతకుముందు ఏడ్చారు. లంచాలు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మ‌ర్లు రిపేర్ చేయించుకున్న ప‌రిస్థితి. ఇప్పుడు క‌రెంట్‌ను ఇచ్చుకున్నాం. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 15 స‌బ్ స్టేష‌న్లు నిర్మించుకున్నారు. వంద‌లాది ట్రాన్స్‌ఫార్మ‌ర్లు తెచ్చుకున్నారు. 24 గంట‌ల క‌రెంట్‌తో పంట‌లు పండించుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం రైతుబంధు తీసుకొస్తే.. కేసీఆర్ బిచ్చ‌మేస్తుండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతులు బిచ్చ‌గాళ్ల లాగా క‌న‌బ‌డుతున్నారా? రైతులు పండించే పంట ఎంత‌? అందులో ఆయ‌న తినేది ఎంత‌? మిగ‌తాది అంతా దేశానికే క‌దా ఇచ్చేది. ఎక్క‌డ త‌క్కువ ఉంటే అక్క‌డ బియ్యం పోతాయి క‌దా అని కేసీఆర్ తెలిపారు.

ధ‌ర‌ణి ఉండాల‌ని, 24 గంట‌ల క‌రెంట్ కావాల‌ని ప్ర‌జ‌లు అంటున్నారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పార్టీల చ‌రిత్ర‌, న‌డ‌వ‌డి గురించి మీరు ఆలోచించాలి. గిరిజ‌న బిడ్డ‌లు ఉన్నారు. మా తండాలో మా రాజ్యం రావాల‌ని కొట్లాడారు. ఏ ప్ర‌భుత్వం కూడా చేయ‌లేదు. ప‌ట్టించుకోలేదు. కానీ మా గ‌వ‌ర్న‌మెంట్‌లో ఆదివాసీ గూడెల‌ను, గిరిజ‌న తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా మార్చాం. అభివృద్ధి చేసుకుంటున్నారు. పోడు ప‌ట్టాలు ఇచ్చామ‌ని కేసీఆర్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని కేసీఆర్ ప్రజలకు స్పష్టం చేశారు. లేదంటే.. కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుత‌ది. జాగ్ర‌త్తా అని మ‌న‌వి చేస్తున్నా. ఈ అభివృద్ది కొన‌సాగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ది నిల‌క‌డ‌గా ముందుకు పోత‌దని కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+