టార్గెట్ సీతక్క - టీఆర్ఎస్ బిగ్ టాస్క్ : కాంగ్రెస్ నేత సపోర్ట్..!?
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యర్ధి పార్టీల్లో బలమైన నేతలను టార్గెట్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ లక్ష్యం. అందులో భాగంగా కాంగ్రెస్ - బీజేపీ లో బలమైన నేతల నియోజకవర్గాల పైన కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గం లో బీఆర్ఎస్ నయా స్కెచ్ సిద్దం చేస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సీతక్క గెలవకూడదని..మాజీ ఎమ్మెల్యేగానే ఉండాలనేది బీఆర్ఎస్ వ్యూహం. ఇందు కోసం కాంగ్రెస్ లో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆపరేషన్ 2023 ప్రారంభించిన బీఆర్ఎస్
వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలనేది బీఆర్ఎస్ అధినాయకత్వం లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల సీట్ల పైన ఫోకస్ పెట్టారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీట్ల పైన ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త స్కెచ్ అమలు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకోవటంతో పాటుగా ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు తిరిగి పోటీ ఖాయమైన నియోజకవర్గాల్లో కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఉండిపోయారు. గులాబీ శిబిరం నుంచి వీరికి ఆఫర్ వచ్చినా తిరస్కరించారు. ఇక, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధానంగా టార్గెట్ చేసిన నియోజకవర్గాల్లో ములుగు ఉంది. కాంగ్రెస్ లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మరింత వేగం పెంచింది. అందులో భాగంగా సీతక్క ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని భావిస్తోంది.

సీతక్క ఓటమే లక్ష్యంగా కొత్త స్కెచ్
ములుగులో సీతక్కను ఓడించి తమ జెండా ఎగురవేయాలనేది బీఆర్ఎస్ టార్గెట్. ఇందు కోసం కొత్త స్కెచ్ సిద్దం చేస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యను తమ పార్టీలోకి తీసుకొని ములుగు నుంచి బరి లోకి దింపాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. వీరయ్య ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలంతో పాటుగా ములుగులోనూ మంచి పట్టు ఉంది. ఇది తమ పార్టీకి రెండు నియోజకవర్గాల్లోనూ కలిసి వస్తుందని గులాబీ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో వీరయ్య ములుగు టికెట్ ను ఆశించారు. అయితే, పార్టీ నాయకత్వం సీతక్కకు అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో వీరయ్య భద్రాచలం నుంచి పోటీ చేసినా..గెలుపొందారు. వీరయ్య 199, 2004 ఎన్నికల్లో ములుగు ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీతక్క చేతిలో, 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి చందూలాల్ చేతిలో ఓడిపోయారు. దీంతో, ములుగులో ఇప్పుుడు బీఆర్ఎస్ కు సరైన అభ్యర్ధిగా భావిస్తోంది.

వీరయ్య అంగీకరిస్తే హోరా హోరీనే..
ములుగు నియోజకవర్గంలో వీరయ్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే బలమైన అభ్యర్ధి అవుతారని భావిస్తున్నారు. అయితే, అందుకు వీరయ్య సిద్దంగా ఉన్నారా లేదా అనేదే చర్చ.సీతక్క సామాజికవర్గానికే చెందిన వీరయ్యను పార్టీలో వస్తే..ఆయన బలంతో పాటుగా పార్టీకి ములుగులో ఉన్న ఓట్ బ్యాంక్ కలిస్తే గెలుపు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. వీరయ్యను ఒప్పించే బాధ్యతను బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఇచ్చారని సమాచారం. సీతక్క కుమారుడు పినపాక నియోజకవర్గం పైన దృష్టిసారించి పర్యటనలు చేస్తున్నారు. దీంతో, రేగా కాంతారావు దీనికి కౌంటర్ గా ములుగులో సీతక్కకు వ్యతిరేకంగా వీరయ్యను ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. వీరయ్య అసలు పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ, ఎన్నికల సమయంలోగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications