ఏ నియోజకవర్గంలో ఎవరు ముందంజ - హోరా హోరీ..!!
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. ఈ కౌంటింగ్ లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ హోరా హోరీగా కనిపిస్తున్నాయి. బీజేపీ సైతం సత్తా చాటుతోంది. కరీంనగర్ లో బండి సంజయ్ ఆధిక్యతలో ఉన్నారు. కాంగ్రెస్ స్వల్ప మెజార్టీ కనిపిస్తున్నా..బీఆర్ఎస్ సైతం పోటీ ఇస్తోంది. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ప్రస్తుతానికి మెజార్టీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దక్కించుకుంది. మరి కొద్ది సేపట్లోనే ఈవీఎంల కౌటింగ్ ప్రారంభం కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తున్నారు. ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజ లో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ముందజలో ఉన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ కు ఇప్పటి వరకు కరీంనగర్ లో ఆధిక్యత కనిపిస్తోంది. మధిర లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ పోస్టల్ బ్యాలెట్ లో మెజార్టీ సాధించారు. కామారెడ్డి, కరీంనగర్ లో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, రేవంత్ పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఆధిక్యతలో ఉండటంతో తరువాతి కౌంటింగ్ పైన ఉత్కంఠ కొనాసగుతోంది.

కాంగ్రెస్ ప్రస్తుతానికి 26 సీట్లలో ఆధిక్యతలో ఉండగా.. బీఆర్ఎస్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ నాలుగు స్థానల్లో ఈ రెండు పార్టీలను దాటి ముందుకెళ్లింది. ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ది తుమ్మల అధిక్యతలో కొనసాగుతున్నారు. వరంగల్ ఈస్ట్ లో కాంగ్రెస్ అభ్యర్ది ముందంజలో ఉన్నారు. ఈవీఎంల్లొనూ ఇదే సరళి కొనసాగితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుందనేది అంచనా వేయటం కష్టంగా కనిపిస్తోంది. దీంతో..హంగ్ సూచనలు కనిపిస్తున్నాయి. మరి కాసేపల్లో కౌంటింగ్ ట్రెండ్స్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications