ఐదు నెలల తర్వాత తిరిగొచ్చిన కవితకు ఘనస్వాగతం
హైదరాబాద్: ఐదు నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుటుంబసభ్యులు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, కుమారుడు ఆదిత్యతో కలిసి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరిన కవిత.. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గులాబీ కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది. కవితపై పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. బోకేలు ఇచ్చేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు.

విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని నివాసానికి కవిత వెళ్లారు. కవితను చూసేందుకు ఆమె నివాసానికి తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. నివాసం వద్దకు రాగానే బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పారు. ధర్మం, న్యాయం గెలుస్తుందని అన్నారు. నిజం కోసం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. కాగా, తన తల్లికి పాదాభివందనం చేసిన కవిత.. తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు.
BRS Leader @RaoKavitha Receives Grand Welcome at Hyderabad Airport#Hyderabad, August 28, 2024: BRS MLC and leader Kavitha Kalvakuntla returned to Hyderabad today after spending five months in #TiharJail in connection with the #Delhi Excise Policy Scam case. She was released on… pic.twitter.com/MDTLDUrJkJ
— Minhaj Hussain Syeed (@MinhajHussains) August 28, 2024
కాగా, గురువారం మధ్యాహ్నం కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహార్ జైలుకు వారెంట్ జారీ చేసింది.
వడ్డీతో చెల్లించే రోజులు ముందు ఉన్నాయి, చెయ్యని పనికి రాజకీయ లాబం కోసం నిందలు వేసిన ఎవణ్ణి వదిలేది లేదు
— నా తెలంగాణ 🫰🏻😍 (@NaaTelanganaa) August 28, 2024
జై తెలంగాణ జై జై తెలంగాణ #KavithaKalvakuntla pic.twitter.com/T6YwAPkChw
బుధవారం కూడా కవిత ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌పై విచారణ జరగ్గా, కొన్ని పత్రాలు సరిగ్గా లేవని, కోర్టు రికార్డుల నుంచి స్పష్టంగా ఉన్న దస్త్రాలను ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్‌ను అందించాలని జడ్జి కావేరి భవేజా కోర్టు అధికారులకు సూచిస్తూ.. విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేశారు. కవిత విడుదలతో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కవితకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications