Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్సీ వర్గీకరణపై క్రెడిట్ వార్ షురూ

Supreme Court on SC, ST sub classification: ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడుమంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారించడానికి ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రాంత్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇచ్చింది.

BRS welcome the Supreme Court ruled on SC ST sub classification

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై 2004లో అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తూ వస్తోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. ఈ తీర్పును కన్నీటితో స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పడం తమ పోరాటానికి నిదర్శనమని అన్నారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణకు నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు.

భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.. దీనిపై స్పందించారు. ఎస్సీ వర్గీకరణ కోసం తాము ముందు నుంచీ ప్రయత్నాలు సాగించామని అన్నారు. వర్గీకరణను తక్షణమే చేయాలంటూ 2014 నవంబర్ 14వ తేదీన తమ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, దీని కాపీని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి అందజేశామని గుర్తు చేశారు.

వర్గీకరణ కోసం సుదీర్ఘపోరాటం జరిగిందని, ఎన్నో త్యాగాలు సంభవించాయని హరీష్ రావు అన్నారు. వర్గీకరణ కోసం ప్రాణ త్యాగం సైతం చేశారని చెప్పారు. గాంధీభవన్ వద్ద గతంలో కొందరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నాడు ప్రాణత్యాగం చేసిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నారని గుర్తు చేశారు.

వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనే కారణంతో మంద కృష్ణ మాదిగ అప్పట్లో గాంధీ భవన్‌ను ముట్టడించిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదని హరీష్ రావు పేర్కొన్నారు. వర్గీకరణ కోసం రాజకీయంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+