ఎవరి మాటలు విని మోసపోవద్దు: బీఆర్ఎస్‌కు వంద సీట్లంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హుస్నాబాద్: ఎన్నికల్లో వచ్చి కొందరు మాయమాటలు చెబుతారని.. వారిని నమ్మి మోసపోతే నష్టపోతామని కేసీఆర్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈరోజే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, అక్కడి నుంచి మేనిఫెస్టో ప్రకటించి నేను మీ దర్శనానికి వచ్చాను. ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను చెప్పే మాటలు విని విడిచిపెట్టి వెళ్లొద్దు. పట్టణంలో బస్తీలో, గ్రామానికో, తండానికో పోయిన తర్వాత కేసీఆర్ నాలుగు మాటలు చెప్పిండు.. ఇందులో నిజమేంత అని ఆలోచించాలన్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రజల సంక్షేమం, అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. ప్రాజెక్టులు, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఎల్కతుర్తిలో బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఎన్నికలు వచ్చాయంటే ఎవరో ఏవో మాటలు చెప్పారని ఆగం కావద్దని.. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలన్నారు కేసీఆర్. ఓటు మన తలరాతను మారుస్తుంది. ఓటు తాలూక రాత, జిల్లా రాతను, రాష్ట్రం భవిష్యత్తును మారుస్తుంది. మా బావ మరిది చెప్పిండు. మా సుట్టం చెప్పండో.. మా మ్యానమామ చెప్పండని ఓట్లు వేయకూడదు. ఖచ్చితంగా ఆలోచించి స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.
గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎంత మార్పు వచ్చిందన్నారు కేసీఆర్.
తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్‌ఎస్‌మీదనే ప్రజలు పెట్టారు. చాలా బాధ్యతగా పెద్ద ఆర్థిక నిపుణులు రాష్ట్రానికి చెందిన, బయట రాష్ట్రాలకు చెందిన రప్పించి రెండుమూడు నెలలపాటు మేధోమథనం చేశాం. ఎక్కడ ఉన్నాం.. ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలి.. ఎక్కడ చూసినా కటిక చీకటి. నీళ్లు లేవు. పంటలు పండవు.. బతుకలేక వలసపోయిన వారు కొందరు.. ఇక్కడే ఒంటి సావలేక బతుకుతున్న వారు కొందరు. చాలా ఘోరమైన పరిస్థితులుండేవి. మీ అందరికీ తెలుసు అని కేసీఆర్ చెప్పారు.
14-15 సంవత్సరాలు ఏకబీగిన పోరాడి తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో అందరి సహకారంతో నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయాం. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో, మంచినీటి రంగంలో, పల్లెల్లో పచ్చదనం, పారిశుధ్యం ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్ వన్. పారిశ్రామిక విధానంలో మనకు ఎవరూ పోటీలో లేరు. సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో, 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో, పారిశ్రామిక విధానం, ఐటీ రంగంలో నెంబర్ వన్‌గా ఉన్నాం. కేంద్రం సహకారం లేకపోయినా.. ప్రతిపక్షాలు గౌరవెల్లి లాంటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేసినా, కుట్రలు చేసినా అధిగమించుకుంటూ ఒకటిఒకటి చేసుకుంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించాం' అని కేసీఆర్ తెలిపారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ పార్టీ గతంలో60 ఏళ్లు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలించి ఏం చేసిందని ప్రశ్నించారుకేసీఆర్. ఎన్నికల వేళ ఏ రాజకీయ నేతలొచ్చి మాయమాటలు చెప్పినా మోసపోవద్దని సూచించారు. హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications