షాకింగ్ న్యూస్: డాక్టర్ల పర్యవేక్షణలో కేటీఆర్
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. లోక్ సభ నియోజవర్గాలవారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వారికి ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేస్తున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.
రెండురోజుల నుంచి ఇంటివద్దే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. రెండోరోజుల్లో పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కదనభేరి సభకు కేటీఆర్ గైర్హాజరవుతున్నారు. త్వరగా కోలుకొని పార్టీని లోక్ సభ ఎన్నికల్లో విజయ పథంలో నడిపించాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకొని తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ తాను సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ నుంచే ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు. కదనభేరి సభకు లక్ష మందిని సమీకరించి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటిచెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
కరీంనగర్ లో ఎస్సారార్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ సభకు కేటీఆర్ దూరమవడంపై పార్టీ శ్రేణులు నిరాశను వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. తనకు కలిసొచ్చిన, సెంటిమెంట్ అయిన కరీంనగర్ ద్వారా శంఖారావాన్ని పూర్తిస్తే విజయం తథ్యమని భావిస్తున్నారు. మెజారిటీ సీట్లు తామే గెలుచుకుంటామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. మూడు పార్టీలు చెబుతున్నాయి. ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications